Ravi Teja – Ram:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో తన సినిమాను విడుదల చేస్తున్నారు అంటే.. కచ్చితంగా మంచి ముహూర్తం, సెలవులు, వీకెండ్స్ దగ్గరగా ఉండే రోజులు, పండుగ దినాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు నెల ఆరంభం అంటే శాలరీ వచ్చే సమయంలో కూడా సినిమాలను రిలీజ్ చేస్తూ క్యాష్ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక ఇద్దరు హీరోలు మాత్రం తెలిసి తెలిసి గోతిలో పడడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు మాస్ మహారాజా రవితేజ (Raviteja) , యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni). దీనికి గల కారణం ఏమిటంటే.. తాజాగా కోటి ఆశలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఇద్దరు హీరోలు కూడా సరైన రిలీజ్ డేట్ ను ఎంపిక చేసుకోకపోవడమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ లను చూస్తుంటే అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ జాతర..
‘ధమాకా’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని చెప్పడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. అదే రవితేజ, శ్రీ లీలా (Sree Leela) కాంబినేషన్లో వస్తున్న ‘మాస్ జాతర’. రవితేజ 75వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ.. షూటింగ్ పూర్తి కాకపోవడం, కార్మిక సంఘాల బంద్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవ్వగా.. దీనికి మంచి స్పందన లభించింది. పైగా రవితేజ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకునే అవకాశం ఉందని.. అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేస్తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా..
మరోవైపు యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తెలుగు సినిమా అభిమాని కథాంశంతో వస్తున్న స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా చిత్రం ఇది. 2025 నవంబర్ 28 విడుదల చేయబోతున్నట్లు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలిసి తెలిసీ గోతిలో పడబోతున్న స్టార్ హీరోలు..
ఇకపోతే అంతా బాగానే ఉన్నా ఈ రెండు డేట్స్ అభిమానులకు తీరని ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. అక్టోబర్ 31న మాస్ జాతర, నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ డేట్స్ చూసుకుంటే సీజన్ అలాగే మంత్ ఎండ్ డేట్స్ అంత మంచివి కావు.. నిజానికి నవంబర్ మంత్ సినిమా రిలీజ్ లకు సరైన సమయం అసలే కాదు. మరి ఇలాంటి సమయంలో తెలిసి తెలిసి ఈ ఇద్దరు హీరోలు మంత్ అండ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవడం పైగా నవంబర్ నెలలో విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ అయ్యాక బాధపడితే ఏం లాభం ఉండదు కాబట్టి మరి దీనిని నిర్మాతలు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
ALSO READ:Sree Leela: వామ్మో శ్రీలీల మామూల్ది కాదుగా..వర్కౌట్ అవుతుందంటారా?