Illu Illalu Pillalu ToIlluday Episode August 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లిని చూసిన వేదవతి ఆస్తులు పోయాయని అందరూ చులకనగా చూస్తారని బాధపడుతుందేమో అని దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది.. నర్మదా శ్రీవల్లి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నర్మదా ప్రేమ కోసం వెతుకుతూ వెళ్తుంది. ప్రేమ బయట వర్షంలో తడుస్తూ ఉండడం చూసి షాక్ అవుతుంది. ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావ్ నువ్వు.. వర్షం పడుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా లోపలికి వెళ్దామని నర్మదా అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నేను రాను నన్ను వదిలేయ్ అని చెప్పేసి అరుస్తుంది.
ఏంటి ప్రేమ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావ్? నేను చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఆ వల్లి మనల్ని ఎంత టార్చర్ పెట్టింది ఇంట్లో అనాధలం అన్న ఫీలింగ్ కూడా కలిగించింది..మనకు అవకాశం వచ్చింది.. ఆవల్లి బండారం బయటపెట్టి ఉంటే చాలా బావుండేది కదా ఎందుకు నువ్వు నన్ను ఆపావు అని ప్రేమ సీరియస్ అవుతుంది..నువ్వు నాకు నచ్చట్లేదు అక్క.. ఇక మీదట నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు అని ప్రేమ అంటుంది. ధీరజ్ ప్రేమల మధ్య రొమాంటిక్ టచ్ స్టార్ట్ అవుతుంది.. అటు నర్మదా సాగర్ల మధ్య రొమాన్స్ పొంగిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తిరుపతి చేతికి చెంబు తగిలించుకొని ఊరిలో వెళుతూ ఉంటే అందరూ ఈ చెంబు ఏంటి అని అడుగుతారు.. నాకు అర్జెంట్గా ఆకలేస్తుంది అని అనుకుంటాడు అంతలోపే ఇడ్లీ సాంబార్ రండి రండి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి బాబు నాకు ఒక ఇడ్లీ వడ ఇవ్వవా అని అడుగుతాడు. ఆనంద్ రావు ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఏంటి ఇడ్లీ అన్నయ్ నువ్వు ఇడ్లి నమ్ముతున్నావేంటి అని అడుగుతాడు.. ఆస్తులు పోయాయి కదా ఇక ఇడ్లీలు అమ్ముకోవాలి అని అంటాడు.
అన్నయ్ నువ్వు ఈ ఇడ్లీ బిజినెస్ చేస్తుందో చూస్తుంటే నీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లు లేదు ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్నట్లు చేస్తున్నావని ఆనందరావు తిరుపతి అడుగుతాడు.. వీడికి తెలిసిపోయేలా ఉంది అది కాదబ్బాయ్ అని మాట మారుస్తాడు.. చూడు తమ్ముడు ఈ చెంబును తీయాలని ప్రయత్నాలు చేసావంటే కచ్చితంగా నీకు జన్మలో పెళ్లి కాదు అని ఆనందరావు అంటాడు.. తిరుపతి భయపడి ఈ చెంబును నేనెప్పుడూ తీయనున్నాయి అని అంటాడు.
ఇక ప్రేమ నర్మదా ఎడమొహం పెడ మొహంతో కూర్చోవడంతో శ్రీవల్లి సంతోషంగా ఫీల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగింది లేకపోతే ఎప్పుడూ అతుక్కుని అక్క అక్క అంటూ రాసుకుంటూ పోసుకుంటూ తిరుగుతారు కదా అని ఆలోచిస్తుంది శ్రీవల్లి. ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగింది అందుకే ఇలా కూర్చున్నారు ఇది మన ఉపయోగించుకోవాలి అని అనుకుంటుంది.. నాకు గవర్నమెంట్ కోడలు నా ముద్దుల మేనకోడలు అంటూ పిలుస్తుంది.
వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి గొడవ పడడంతో వేదవతి షాక్ అవుతుంది. ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏమైందే ఎందుకు గొడవ పడుతున్నారని టెన్షన్ పడుతూ అడుగుతుంది. కానీ నర్మద ప్రేమలు మాకు గొడవైంది అంతే అని బయటికి వెళ్లిపోతారు. ప్రేమ దగ్గరికి వచ్చి నర్మదా నువ్వు ఈ ఇంటికి వస్తే నిన్ను అమ్మలాగ చూసుకున్నాను అది మర్చిపోయావా.. ఏది నువ్వు నాతో మాట్లాడవా నా మొహం చూసి చెప్పు అని ప్రేమని అడుగుతుంది. మన మాటలు విన్న ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇద్దరూ మళ్లీ కలిసిపోతారు. శ్రీవల్లి మాత్రం అయ్యో వీళ్ళిద్దరి ఇక కలవరని అనుకున్నాను. అప్పుడే ఇలా కలిసిపోయారు అండి కాసేపు కూడా నాకు ఆనందం లేకుండా చేశారే అని అనుకుంటుంది. ఇక వేదవతి వీళ్లిద్దరు ఎందుకు గొడవపడ్డారు అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ చూసి మీరిద్దరి మళ్ళీ కలిసిపోయారా నాకు చాలా ఆనందంగా ఉంది అని ముగ్గురూ కలిసి సంతోషంగా ఉంటారు. ఇక శ్రీవల్లి వీళ్ళ ముగ్గురిని చూసి కుళ్ళుకుంటుంది.
Also Read : అబద్దం చెప్పిన అక్షయ్.. పల్లవి, శ్రీయలకు పార్వతి షాక్.. అక్షయ్ వ్రతానికి వస్తాడా..?
భాగ్యం ఆనందరావు మనం ఇక దాచాల్సిన అవసరం లేదు మన ఆస్తులు పోయాయి. మన వ్యాపారం ఇదే అని చెప్పుకోవాల్సింది. ఇక నువ్వెందుకు టెన్షన్ పడతావు ఆ ప్రేమ నర్మదా ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అయితే అప్పుడే శ్రీవల్లి వచ్చి ఈ సమస్య ఎక్కడ పోయింది మా ఆయనకు మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు అలాగే ఉండిపోయాయి ఆయన నాతో మాట్లాడుతున్నాడా? నాకు కాపురం కూలిపోయేలా ఉంది అని బాధపడుతుంది. ఆ ప్రేమ నర్మదాల గురించి ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది వాటిని బయట పెడితే మనం ఎస్కేప్ అవ్వచ్చు అని భాగ్యం అంటుంది. ముగ్గురు కలిసి భారీ ప్లానే వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…