E-Paper
Advertisement

Tollywood : మహేష్, బన్నీ ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఎదురుచూపులు తప్పవు..!

Tollywood : మహేష్, బన్నీ ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఎదురుచూపులు తప్పవు..!
Advertisement

Tollywood : గత ఏడాదితో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు సినిమాలు తమ సినిమాను రిలీజ్ చేసేందుకు రిలీజ్ డేట్ ని బ్లాక్ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మొత్తం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి ఒక రేంజ్‌లో ఉండబోతోంది. ఈ ఏడాది మెగాస్టార్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మన శంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. సమ్మర్ లో మెగా హీరోలు తమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరూ ఈ సంవత్సరంలోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మహేష్ బాబు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఎప్పుడూ ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చే ఈ హీరోలు మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు ఏ సినిమా చేస్తున్నారు? షూటింగ్ అప్డేట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

మహేష్, అల్లు అర్జున్ సినిమాలు..

Advertisement

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కనీసం ఒక్క సినిమాతోనైన ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.. ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. వీటికోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కానీ, ఈ ఏడాది మాత్రం మహేష్ బాబు, అల్లు అర్జున్ నుంచి ఒక్క సినిమా కూడా రాదని తెలుస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వారణాసి సినిమా రాబోతుంది. రాజమౌళితో సినిమాలంటే షూటింగ్ పూర్తి అవ్వాలంటే కనీసం రెండు ఏళ్లు కచ్చితంగా పడుతుంది. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, 2027 వేసవి విడుదలకు సిద్ధమవుతోంది..

Advertisement

ఇక అలాగే అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 30 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.. ఈ రెండు సినిమాలు కూడా భార్య కథ తో పాటుగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. షూటింగ్ ఆలస్యం వల్లే సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి..

Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ..అబ్బాయి ఎవరో తెలుసా..?

బన్నీ సినిమాల విషయానికొస్తే.. 

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. మరో తమిళ డైరెక్టరేనా లోకేష్ కనకరాజు తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. ఇదే ఏడాదిలో ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి రాబోతుంది..

 

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×