E-Paper
Advertisement

AP Budget 2026: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు

AP Budget 2026: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు
Advertisement

AP Budget 2026: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ – 2026-27ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రతులలోని ఆదాయ, వ్యయాలు, బడ్జెట్ కేటాయింపుల గురించి ఆయన ప్రసంగించారు. ఈ వార్షిక బడ్జెట్ ను రూ. 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్యలోటు రూ. 75,868 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు.

రంగాల వారీగా..

ఏపీ బడ్జెట్ కేటాయింపులు రంగాల వారీగా ఇలా ఉన్నాయి. పాఠశాల విద్య రూ.రూ.32,308 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 23,650 కోట్లు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూ. 22,941 కోట్లు, ఆరోగ్య రంగం రూ. 19,306 కోట్లు, జల వనరులు – రూ.18,223 కోట్లు, ఆరోగ్య రంగం రూ. 19,306 కోట్లు, విద్యుత్ శాఖ రూ. 13,934 కోట్లు, వ్యవసాయ రంగం రూ.11,745 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ రూ. 11,118 కోట్లు, వెనకబడిన వర్గాలు రూ.10,699 కోట్లను బడ్జెట్ లో ఆర్థిక మంత్రి కేటాయించారు.

Advertisement

అమరావతికి రూ.6 వేల కోట్లు

కేటాయింపులు విషయానికి వస్తే రాజధాని అమరావతికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు, ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు ప్రకటించారు. అదే విధంగా సర్దుబాటు నిధికి రూ.1,500 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు, జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్ల బడ్జెట్ నిధులు ప్రకటించారు.

Advertisement

పథకాల వారీగా కేటాయింపు..

అదే విధంగా దీపం 2.0 పథకానికి రూ. రూ.2,601 కోట్లు, తల్లికి వందనం రూ.9,668 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ.1,232 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలు రూ.3,836 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్ రూ.2,946 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రూ.2,161 కోట్లు కేటాయించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి రూ.1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ. 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర రూ.654 కోట్లు, యువత – క్రీడల విభాగానికి రూ. 438 కోట్లు, రాష్ట్రంలోని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు.

Also Read: Somireddy on Jagan: జగన్‌కు శవాలంటే ఇష్టం.. చంపి డిక్కీలో పడేస్తే భుజం తట్టాడు.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు

అన్నదాత సుఖీభవకు ఎంతంటే?

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.1,927 కోట్లు, మత్స్యకార సేవలో పథకానికి రూ.260 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.1,927 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు, పంటల బీమా కోసం రూ.250 కోట్లు, వివిధ వర్గాల ఆర్థిక మద్దతు కోసం రూ.2,320 కోట్లు, సబ్సిడీ – విద్యుత్ కోసం రూ.600 కోట్లు కేటాయించారు.

ఆదాయ వ్యయాలు ఇలా..

రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయ మార్గాలను సైతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. పన్నుల ద్వారా ఆదాయం 38 శాతం, పన్నేతర ఆదాయం 3 శాతం, బహిరంగ మార్కెట్ రుణాలు 30 శాతం, కేంద్ర పన్నుల్లో వాటా 19 శాతం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 10 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇక వ్యయానికి వస్తే సంక్షేమానికి 17 శాతం, విద్యకు 11 శాతం, ఆర్థికానికి 8 శాతం, పంచాయాతీ రాజ్ – గ్రామీణాభివృద్ధికి 7 శాతం, వైద్యారోగ్యం 6 శాతం, జలవనరులు 6 శాతం, మున్సిపాలిటీ 4 శాతం, విద్యుత్ రంగం 4 శాతం, వ్యవసాయం దాని అనుబంధ రంగం 4 శాతం, వడ్డీలు రుణ చెల్లింపులకు 18 శాతం, హోం – ఆర్ & బీ, పరిశ్రమల ఖర్చుల కోసం 15 శాతం బడ్జెట్ నుంచి ఖర్చు చేయనున్నారు.

Also Read: Bangladesh – BJP: బంగ్లాదేశ్‌లో సంచలనం.. బోణి కొట్టిన బీజేపీ.. భారీ మెజారిటీతో ప్రభంజనం

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×