Actress Trisha: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan)ఒకరు. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్రిష ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె నటుడు విజయ్ తో రిలేషన్ ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలకు అనుగుణంగానే హీరో విజయ్ భార్య తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా సంగీతం విడాకులు కావాలని కోరడంతో విజయ్ త్రిష మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలను విజయ్ కానీ త్రిష కానీ ఎక్కడ స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ ను ప్రత్యర్థులు తన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్నికలలో భాగంగా విజయ్ తన నామినేషన్ దాఖలు చేస్తూ ఆస్తులకు సంబంధించిన వివరాలను అఫీడవిట్ లో పొందపరిచారు. ఇలా విజయ్ ఆస్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు త్రిష ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా విజయ్ సంగీతకు కాకుండా త్రిష పేరు మీద ఆస్తులు కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష పేరు మీద ఉన్న ఆస్తి వివరాలు వైరల్ అవుతున్నాయి.
100 కోట్ల ఆస్తులను కలిగిన త్రిష…
పలు నివేదికల ప్రకారం త్రిష తన నికర ఆస్తులు సుమారు 100 కోట్ల రూపాయల విలువ చేస్తాయని తెలుస్తుంది. వీటితోపాటు చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలలో ఈమెకు ఖరీదైన ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. త్రిష రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని సమాచారం. వీటితో పాటు ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఒక్కో సినిమాకు సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో కూడా త్రిష భారీగా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవికి జోడిగా నటించిన విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వీటితోపాటు పలు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్నారు.
Also Read: ఆ సీనియర్ హీరోతో సినిమా…ఫీలింగ్స్ రావంటున్న రాశి!