E-Paper
Advertisement

Swayambhu: నిఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. ‘స్వయంభు’ మరో ‘మిరాయ్’ అవుతుందా?

Swayambhu: నిఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. ‘స్వయంభు’ మరో ‘మిరాయ్’ అవుతుందా?
Advertisement

Swayambhu: టాలీవుడ్‌లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం నిఖిల్ ఆశలన్నీ తన అప్-కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ పైనే ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఒక రకంగా చెప్పాలంటే, నిఖిల్ కెరీర్‌లో ఇది ఒక డూ ఆర్ డై లాంటి ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ‘కార్తికేయ 2’తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్, ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మెప్పించలేకపోయాడు. రేసులో మరోసారి వెనుకబడ్డాడు. అందుకే ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ పెట్టిన ఎఫర్ట్స్ మామూలుగా లేవు. ఈ సినిమా కోసం తను కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.

Also Read- Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

పీరియడ్ డ్రామాల ట్రెండ్‌ కొనసాగిస్తూ..

Advertisement

‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు పరిశ్రమలో పీరియడ్ చిత్రాల పర్వం మొదలైంది. రాజమౌళి సెట్ చేసిన ఆ బెంచ్ మార్క్ అందుకునేందుకు చాలా సినిమాలు ప్రయత్నిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్, ఎమోషనల్ కథాంశం.. ఇవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టాక్. ‘బాహుబలి’ తర్వాత ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. కంటెంట్‌లో దమ్ముంటేనే పీరియడ్ డ్రామాలను ఆదరిస్తున్నారు. మరి ‘స్వయంభూ’ ఆ స్థాయిలో ప్రేక్షకులను శాటిస్ ఫై చేస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా కంటెంట్ పరంగానూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని యూనిట్ చెబుతోంది. ఈ ఏడాది ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందనేలా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

Also Read- Thammareddy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘పెద్ద’ ఎవరూ లేరు! తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

‘మిరాయ్’ తరహా చిత్రమట

Advertisement

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న సమాచారం కానీ, అవుతున్న లీక్స్ కానీ ఏం చెబుతున్నాయంటే.. ఈ సినిమా ‘మిరాయ్’ తరహాలో ఉంటుందని కచ్చితంగా నిఖిల్‌కు బిగ్ సక్సెస్‌ని ఇస్తుందనేలా టాక్ నడుస్తుంది. అందుకే నిఖిల్ కూడా ఈ సినిమా కోసం అంత కష్టపడుతున్నాడు. ఫిబ్రవరి 11న ఈ చిత్ర టీజర్ రాబోతుంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. టీజర్ ఎలా ఉంటుందో? భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఏప్రియల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Also Read- Crime Thriller OTT : చచ్చిన ఏడేళ్ళ తరువాత వరల్డ్ పాలిటిక్స్ ను ఊపేసిన ఖేడీ కథ… అమెరికాను షేక్ చేసిన కామన్ మ్యాన్ క్రైమ్ లార్డ్ గా ఎలా ?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×