E-Paper
Advertisement

బోసిపోయిన బాక్సాఫీస్ ..బలైపోయిన ఎగ్జిబిటర్స్ …ఈ వారమూ ఇంతేనా?

బోసిపోయిన బాక్సాఫీస్ ..బలైపోయిన ఎగ్జిబిటర్స్ …ఈ వారమూ  ఇంతేనా?
Advertisement

Summer Boxoffice : ఒకప్పుడు సమ్మర్ సీజన్ వస్తే సినిమా థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.అసలే గత పెద్ద హీరోల సినిమాలు లేక సగానికి సగానికి ఆక్యుపెన్సీ తగ్గితే, వచ్చిన చిన్నా చితాకా సినిమాలు కాస్తా అలరించక ఆ మిగిలిన సగాన్ని కూడా బయపెట్టేస్తున్నాయ్.ఇక ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలు కూడా అదే బాట పట్టడంతో ఎప్పటిలాగే బోసిపోతుంది బాక్సాఫీస్.

గోదారి గట్టున ప్రేక్షకులు ఏరి?

Advertisement

సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ‘గోదారి గట్టుపైన’ సినిమాపై ముందే అంచనాలు తక్కువ. ‘మేమ్ ఫేమస్’తో పర్లేదనిపించిన ఈ కుర్రాడికి ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టం అయిపొయింది. అప్పట్లో మెయిన్ సెంటర్లలో భారీగా ప్రీమియర్లు వేస్తే, ఈసారి మాత్రం కేవలం హైదరాబాద్‌తో పాటు అతికొద్ది ప్రాంతాలకే పరిమితం చేయడం గమనార్హం.ఇకప్రీమియర్ టాక్ మిక్స్‌డ్‌గా ఉండటంతో రెగ్యులర్ ఆడియన్స్ అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. కూల్ సమ్మర్ అంటూ ప్రచారం చేసినా, థియేటర్లో మాత్రం ఆ కూల్‌నెస్ కనిపించడం లేదన్నది చూసిన వాళ్ళ మాట.

also read :రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!

Advertisement

మెగా కోడలి సైలెంట్ ఎంట్రీ.. రిజల్ట్ షాకింగ్

ఇక ఈరోజే వచ్చిన మరో సినిమా ‘సతీ లీలావతి’. నిజానికి మెగా ట్యాగ్ వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం బాగానే ఉండేది. దానికి తోడు రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ చేయడంతో ఏదో జరుగుతుందని ఊహించారు. కానీ, కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించకుండా సినిమాను సైలెంట్‌గా థియేటర్లలోకి వదిలేశారు. చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రమోషన్లకు వస్తారని ఆశ పడ్డ ఆడియన్స్ కి నిరాశే ఎదురైంది.ప్రమోషన్లు పెద్దగా లేకపోవడంతో అసలు ఈ సినిమా థియేటర్లలో ఉందన్న విషయమే సగం మందికి తెలికుండా పోయిందంటే సినిమా ప్రచారంలో ఎంత వీక్ అనండి తెలిసిపోతుంది.ఫలితంగా మార్నింగ్ షోలకే జనం లేక థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి.ఇక టికెట్లు తెగక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి కూడా.పైగా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదన్న ప్రచారం సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గించేసింది.

రేజర్’ పరిస్థితి అయితే మరీ దారుణం

ఇక ప్రయోగాత్మక దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘రేజర్’ పరిస్థితి అయితే మరీ దారుణం. ఓపెనింగ్స్ లో కనీసం మినిమం అంటే మినిమం కూడా వసూలు చేయలేదంటే రేజర్ ఎంత మొండి బారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో రవిబాబు సినిమాలకు ఉండే క్రేజ్ ఇప్పుడు ఏ కోశానా కనిపించడం లేదు.రవి బాబు ప్రచారాన్ని అంతా ఒంటి మీద వేసుకున్నా సినిమా కథలో సరైన కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు.

ఎగ్జిబిటర్లు ఈ సినిమాలకి బలైనట్టే

ఓటీటీల ప్రభావం, పైరసీ బెడద ఎలా ఉన్నా.. సరైన పబ్లిసిటీ లేకుండా, కంటెంట్‌పై నమ్మకం లేకుండా సినిమాలను విడుదల చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇవాళ వచ్చిన సినిమాలు కనీసం వీకెండ్ వరకైనా నిలబడతాయా? లేక మొదటి రోజుకే సర్దేస్తాయా? అనేది చూడాలి. మొత్తానికి ఈ శుక్రవారం సినిమాలని వేసుకున్న ఎగ్జిబిటర్లు ఈ సినిమాలకి బలైనట్టే కనిపిస్తుంది. చూడాలి మరి థియేటర్స్ అన్నీ పెద్ది రాక కోసం ఎదురుచూస్తాయా ..లేక ఈ మధ్యలో ఏదైనా సినిమా వాటి ఆకలిని తీరుస్తుందా !

also read :గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె నిశ్చితార్థం.. అల్లుడు ఎవరంటే?వైరల్ వీడియో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×