Film industry:సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి చెందిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది. అయితే అందులో ఆ సెలబ్రిటీలు చేసే పనులు అందర్నీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులు అందరికి వింతగా అనిపిస్తూ ఉంటాయి కూడా. ఒక్కొక్కరు రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆశ్చర్యపరిస్తే.. మరికొంతమంది లేటు వయసులో యంగ్ సెలబ్రిటీలతో వివాహం చేసుకొని వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా నాల్గవ పెళ్లి కోసం.. ఆయన చేస్తున్న హడావిడి మాత్రం మామూలుగా లేదు. ఏకంగా అంతరిక్షంలో తన పెళ్లి అని , అందరూ ఆహ్వానితులే అంటూ చెప్పడంతో ఇది విన్న ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆ హీరో ఎవరో కాదు హాలీవుడ్ దిగ్గజం టామ్ క్రూజ్ (Tom Cruise). ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాలలో ఈయన చేసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి ప్రాణం పణంగా పెట్టడంలో కూడా ముందుంటాడు. బైక్ స్టంట్ లు, ఫ్లైట్స్ నుంచి దూకేయడం , రియల్ స్టంట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ వంటి చిత్రాలు ఆయన యాక్షన్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అలాంటి ఈయన ఇప్పుడు 63 ఏళ్ల వయసులో కూడా చేసే స్టంట్స్ అందరికీ భయాందోళనలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా.. 63 ఏళ్ల లేటు వయసులో ఏకంగా నాల్గవ పెళ్లికి సిద్ధమయ్యారు టామ్. ముఖ్యంగా తన వయసులో సగం వయసు ఉన్న హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డీ ఆర్మాస్ (Ana de armas) తో ఏడడుగులు వేయబోతున్నారు. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న వీరు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోబోతున్నారట.పైగా తన సినిమాల లాగానే తన పెళ్లి గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.. అందులో భాగంగానే ఆయన తన నాల్గవ పెళ్లిని ఏకంగా అంతరిక్షంలో జరుపుకోవాలని, ఈ వివాహానికి అందరూ ఆహ్వానితులే అని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
టామ్ క్రూజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. గతంలోనే ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మొదట మిమి రోజర్స్ ను వివాహం చేసుకున్న ఈయన విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నికోల్ కిడ్ మన్, కేటీ హోమ్స్ లను వివాహం చేసుకున్నారు. అయితే అందరికి కూడా విడాకులు ఇవ్వడం గమనార్హం. పైగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
టామ్ క్రూజ్ వివాహం చేసుకోబోయే అనా డి ఆర్మాస్ విషయానికి వస్తే.. గతంలో ఈమె మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్ తో ప్రేమాయణం నడిపింది. ఇతడు క్యూబా అధ్యక్షుడు కుమారుడు కూడా. ఇప్పుడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న టామ్ క్రూజ్ తో పెళ్లికి సిద్ధమయ్యింది.
Also read :Actress Kajol: నటి కాజోల్ కి ఘోర అవమానం.. పబ్లిక్ లో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ!
?utm_source=ig_web_copy_link