KL Rahul: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టే దిశగా దూసుకు వెళ్తోంది గిల్ సేన. అయితే ఈ నేపథ్యంలో… వెస్టిండీస్ జట్టు పైన సెంచరీ నమోదు చేశాడు కేఎల్ రాహుల్. 190 బంతుల్లో ఏకంగా 12 బౌండరీలు సాధించిన కే ఎల్ రాహుల్ 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ నమోదు… చేసుకున్నాడు. కేవలం 190 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకున్నాడు కేఎల్ రాహుల్. ఇందులో 12 బౌండరీలు కొట్టాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత…. అతడు చేసుకున్న సెలబ్రేషన్స్… అదిరిపోయాయి. నోట్లో వేలు పెట్టి విజిల్ వేస్తూ మరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు సూపర్ హీరో కేఎల్ రాహుల్. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే…. వెస్టిండీస్ బౌలర్ వారీకాన్ వేసిన అద్భుతమైన బంతికి జస్టిన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్. దీంతో టీమిండియా… మరో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ అవుట్ అయినప్పటికీ జురెల్, టీమిండియా వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 87 ఓవర్లు వాడిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి… 296 పరుగులు చేసింది. అంటే ఓవరాల్ గా వెస్టిండీస్ జట్టు పైన 134 పరుగుల లీడ్ సంపాదించింది టీమిండియా. ఇది ఇలా ఉండగా.. ఈ అహ్మదబాద్ టెస్టులో విండీస్ దారుణంగా విఫలమైంది. కేవలం 162 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. ఏ ఒక్క ప్లేయర్ పెద్దగా రాణించడకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
వెస్టిండీస్ పై సెంచరీ చేసిన కేఎల్ రాహుల్….విజిల్స్ వేస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. బీసీసీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చేందుకే కేఎల్ రాహుల్ ఇలా చేశాడని అంటున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు కేఎల్ రాహుల్ ను సెలక్ట్ చేయలేదు బీసీసీఐ. టీ20 లలో అద్భుతంగా రాణించే… కేఎల్ రాహుల్ ను సెలక్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం టెస్టులకే కేఎల్ రాహుల్ ను వాడుకుంటున్నారని ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే.. ఎవరూ ఆడకపోయినా.. సెంచరీ చేసి.. విజిల్స్ వేశాడు కేఎల్ రాహుల్. దీంతో బీసీసీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చేందుకే ఇలా కేఎల్ రాహుల్ చేశాడని అంటున్నారు.
EMOTIONAL CELEBRATION BY KL RAHUL…!!! 🥺❤️
– The best Test Opener Currently in Cricket. pic.twitter.com/hzxXAkzT3C
— Johns. (@CricCrazyJohns) October 3, 2025