Apple Watch Life save| ఒక 26 ఏళ్ల యువకుడు సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అనుకోకుండా ప్రమాదకర లోతుకు వెళ్లిపోయాడు.. అతనికి ప్రాణాపాయం ఉండగా.. అతను ధరించిన ఆపిల్ వాచ్ ఆశ్చర్యకరంగా అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన పుదుచ్చేరిలో జరిగింది.
పుదుచ్చేరి సముద్రంలో స్కూబా డైవింగ్ సమయంలో ఐటీ ఉద్యోగి అయిన 26 ఏళ్ల క్షితిజ్‌కు ప్రమాదం జరిగింది. అతని వెయిట్ బెల్ట్ వేరైపోయింది. అతడు వేగంగా సముద్ర గర్భం లోతులోకి జారిపోతుండగా.. ఆపిల్ వాచ్ అల్ట్రా సైరన్ ఫీచర్ అతడిని కాపాడింది. అతడి ఊపిరి తిత్తులకు ప్రమాదకర గాయాలు కాకుండా రక్షించింది. ఈ ఘటన గురించి తెలిసి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ Xలో స్పందించారు.
క్షితిజ్ జోడపే, ముంబై నగరంలో నివసించే 26 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి. 2020 నుండి డైవింగ్ చేస్తున్నాడు. బే ఆఫ్ బెంగాల్ లో 36 మీటర్ల లోతులో డైవ్ చేశాడు. అక్కడ వాతావరణం ప్రమాదకరంగా మారింది. ఒక్కసారిగా సముద్రంలో రాకాసి అలలు అలజడి సృష్టించాయి. విజిబిలిటీ 20-25 మీటర్ల నుండి 5-10 మీటర్లకు తగ్గింది. పరిసరాలు కనిపించడం లేదు.
ఈ సమయంలో అకస్మాత్తుగా క్షితిజ్ వెయిట్ బెల్ట్ వేరైపోయింది. డైవ్ ఆగిపోయింది. దీంతో భయపడిపోయాడు. అతను క్రమంగా సముద్రంలోకి జారుతూ పోయాడు. ఉపరితలంపైకి రావాలని ప్రయత్నించినా చాలా కష్టంగా మారింది. సహాయం కోసం సిగ్నల్ ఇవ్వడం కూడా కష్టమైంది.
ఈ సమయంలో క్షితిజ్ చేతికి ధరించిన ఆపిల్ వాచ్ అల్ట్రా డైవ్ డెప్త్‌ను (అతడు ఎంత సముద్రలోతులో ఉన్నాడో) మానిటర్ చేసింది. ర్యాపిడ్ వర్టికల్ ఎసెంట్‌ను గుర్తించింది. “స్లో డౌన్” అని వాచ్‌లో డిస్‌ప్లే ఫ్లాష్ అయింది. క్షితిజ్‌కు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. క్షితిజ్ వేగంగా పైకి రావాలని ప్రయత్నిస్తే అతని ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అతడికి వాచ్ తెలియజేసింది. అందుకే క్షితిజ్ మెల్లగా రావడానికి ప్రయత్నించాడు. స్పీడ్ మారలేదు. ఆ తరువాత వాచ్ కొంచెం వెయిట్ చేసింది. ఆ తరువాత వాచ్ లోని సైరన్ లౌడ్‌గా మొదలైంది.
సైరన్ నీటిలోపలి నుంచి వస్తూ ఉండగా.. లౌడ్ హై చైమ్ అల్టర్నేట్‌గా వచ్చింది. స్కూబా డైవింగ్ చేయిస్తున్న ఇన్‌స్ట్రక్టర్ సౌండ్ విని క్షితిజ్ ఉన్న దిశ వైపు ఈదాడు. అతడికి క్లియర్‌గా వాచ్ శబ్దాలు వినిపించాయి. వెంటనే తిరిగి ఈదాడు. క్షితిజ్ క్రమంగా మరో 10 మీటర్లు ఎదుగుదల చెందాడు. చివరికి ఇన్‌స్ట్రక్టర్ అతన్ని పట్టుకున్నాడు. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. వాచ్ సైరన్ సరైన సమయంలో మోగడం వల్లే ఇదంతా సాధ్యమైంది.
ఈ ఘటన గురించి క్షితిజ్.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ఈమెయిల్ చేశాడు. స్టోరీని షేర్ చేశాడు. టిమ్ పాజిటివ్‌గా రిప్లై చేశాడు. “ఇన్‌స్ట్రక్టర్ సైరన్ విని సహాయం చేశాడు, గుడ్” అని అన్నాడు. “షేరింగ్ కోసం థాంక్స్, టేక్ కేర్.” అంటూ రిప్లై ఇచ్చారు.
ఆపిల్ 2022 చివరలో వాచ్ అల్ట్రాను రిలీజ్ చేసింది. అడ్వెంచర్ యూజర్ల కోసం ఇది రగ్డ్ వాచ్. ఎమర్జెన్సీల సమయంలో సైరన్ ఒక అద్భుతమైన ఫీచర్. ఈ సైరెన్ చేతి నుంచి గట్టిగా అరుపులు వేసే బ్యాన్షీ జంతువులా శబ్దాలు చేస్తుంది. ఈ సౌండ్ 180 మీటర్లు ప్రయాణిస్తాయి. ఇతర సౌండ్‌లు ఉన్నా వాటిని మ్యూట్ చేసి క్లియర్ గా వినిపిస్తుంది. సైరన్ ఆఫ్ చేసేదాకా ప్లే అవుతుంది. బ్యాటరీ స్లోగా డ్రైన్ అవుతుంది. అడవి లేదా సముద్ర ప్రాంతాల్లో వెళ్లినప్పుడు ఈ వాచ్ సైరెన్ చాలా ఉపయోగకరం.
ఈ వాచ్ సైరెన్ వెరబుల్స్ ఎన్నో సందర్భాల్లో లైఫ్‌సేవర్‌గా నిరూపించాయి. క్షితిజ్ స్టోరీ ఇతర డైవర్లకు స్ఫూర్తి. డైవర్లు అండర్‌వాటర్‌లో అలర్ట్‌గా ఉండాలని క్షితిజ్ కు జరిగిన ప్రమాదం ద్వారా తెలుస్తోంది.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్