E-Paper
Advertisement

Toxic: కన్నడ ఇండస్ట్రీలో కూడా టాక్సిక్ పై వివాదాలు.. ఎందుకంటే..!

Toxic: కన్నడ ఇండస్ట్రీలో కూడా టాక్సిక్ పై వివాదాలు.. ఎందుకంటే..!
Advertisement

Toxic: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న కొత్త సినిమా టాక్సిక్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ను 2026 ఫిబ్రవరి 20న విడుదల చేశారు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. డార్క్ వాతావరణం, హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, గంభీరమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది గీతు మోహండాస్. ఆమె సృష్టించిన ప్రపంచం చాలా ఇంటెన్స్‌గా ఉందని కొంతమంది ప్రశంసించారు. అయితే కథ విషయానికి వస్తే టీజర్‌లో స్పష్టత లేకపోయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సొంత కనడ ఇండస్ట్రీలో కూడా ఈ చిత్రం విమర్శల పాలవుతోంది. టీజర్‌లో సన్నివేశాలు చాలా వేగంగా కట్ అవుతున్నాయని, కొన్ని భాగాలు అర్థం కావడం కష్టంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

Advertisement

ముఖ్యంగా కన్నడ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు ఇది పీరియడ్ యాక్షన్ డ్రామాగా ముందే చూసినట్టే అనిపిస్తోందని అంటున్నారు. పాత్రల ప్రెజెంటేషన్, యాక్షన్ స్టైల్ గతంలో వచ్చిన సినిమాలను గుర్తు చేస్తున్నాయని వారి అభిప్రాయం. కొందరు దీనిని “మార్కో” తరహా సినిమాలతో పోల్చారు. హింసకు తమకు అభ్యంతరం లేదని, కానీ కొత్తదనం ఉంటే ఇంకా బాగుండేదని వారు స్పష్టం చేశారు.

మరో ప్రధాన విమర్శ ఏమిటంటే సినిమా ప్రాథమిక కథ ఏమిటో టీజర్ ద్వారా అర్థం కాలేదన్నది. కొన్ని సీన్లు అకస్మాత్తుగా మారిపోతున్నాయని, దాంతో కనెక్ట్ కావడం కష్టమైందని నెటిజన్లు చెబుతున్నారు.

Advertisement

అయితే యష్ స్టార్ ఇమేజ్ కారణంగా సినిమా ఓపెనింగ్ మాత్రం బలంగా ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ దీర్ఘకాలంలో సినిమా నిలబడుతుందా లేదా అన్న దానిపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. కొందరు కన్నడ రాష్ట్రాల నుంచే భారీ బడ్జెట్ రికవరీ చేయడం కష్టమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదే రోజున ధురంధర్ 2 విడుదల కావడం వల్ల పోటీ కూడా ఎక్కువగా ఉండనుంది. అందుకే టాక్సిక్ నిజంగా బ్లాక్‌బస్టర్ కావాలంటే స్టార్ పవర్‌తో పాటు బలమైన కథ, స్క్రీన్‌ప్లే అవసరమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చివరికి, పూర్తి సినిమా విడుదలైన తర్వాతే ప్రేక్షకుల తీర్పు స్పష్టంగా వెలువడనుంది.

ALSO READ: Chiranjeevi vs Allu Arjun: చిరంజీవి vs అల్లు అర్జున్..ఫిలిం ఫేర్ అవార్డ్స్ రికార్డ్స్ లో నిజం ఏమిటంటే..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×