E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న ఈ చిన్న గౌను ధర తెలిస్తే షాకవుతారు

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న ఈ చిన్న గౌను ధర తెలిస్తే షాకవుతారు
Advertisement

భారత క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆయన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ పుట్టినరోజు వేడుకలు వైరల్ కావడంతో… ఆమె వేసుకున్న చిన్న గౌను ధర గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆ గౌను ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు ఎంతో మంది. మహికా శర్మ ఇటీవల తన పుట్టినరోజును సన్నిహితులు, స్నేహితుల మధ్య చాలా అందంగా జరుపుకుంది. ఈ వేడుకకు హార్దిక్ పాండ్యా కూడా హాజరయ్యాడు. బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ః

పార్టీ వేదికను ఎరుపు రంగు బెలూన్లు, పూలు, కాండిల్ లైట్లు, డెకరేషన్‌తో చాలా రొమాంటిక్‌గా అలంకరించారు. కేక్ కట్ చేసే సమయంలో మహికా నవ్వుతూ కనిపించగా, హార్దిక్ పక్కనే నిలబడి ఆమెకు విష్ చేశాడు. కేక్ మొదటి ముక్కను హార్దిక్‌కే తినిపించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించినది మహికా లుక్. ఆమె వేసుకున్న చిన్న మినీ గౌను చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఈ డ్రెస్ ఆరెంజ్, పింక్, మజెంటా కలిసిన షేడ్స్‌తో ఉంది. అందమైన చిన్న డ్రెస్సులో మహికా ఎంతో అందంగా మెరిసిపోయింది.

Advertisement

Also read: Costly Train: ఈ రైలులో ప్రయాణించాలంటే ఒక్క రాత్రికి రూ.2 లక్షలు చెల్లించాల్సిందే

ఈ గౌను ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ Clio Peppiatt రూపొందించిన డిజైన్ అని తెలుస్తోంది. డ్రెస్‌పై హ్యాండ్ వర్క్, క్రిస్టల్ అలంకరణలు ఉండటం వల్ల ఇది ఖరీదైనదని తెలుస్తోంది. స్లీవ్‌లెస్ డిజైన్, బాడీ ఫిట్ స్టైల్, చిన్న లెంగ్త్ కలిసి మహికాకు గ్లామరస్ లుక్ ఇచ్చాయి. ఆమె మేకప్ కూడా చాలా సింపుల్‌గా చేసింది. ఓపెన్ హెయిర్, చిన్న ఇయరింగ్స్, లైట్ హీల్స్‌తో మొత్తం లుక్‌ను క్లాసీగా పూర్తి చేసింది.

Advertisement

ధర ఎంత?
రిపోర్టులు చెబుతున్న ప్రకారం మహికా వేసుకున్న ఈ మినీ గౌను ధర సుమారు రూ.3 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇంత చిన్న డ్రెస్ అంత ఖరీదా అని ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ డ్రెస్ ధరను హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజుతో పోల్చుతూ మాట్లాడుతున్నారు. ఒక టీ20 మ్యాచ్‌కు వచ్చే ఫీజుతో పోలిస్తే ఈ గౌను ధర దాదాపు సమానంగా లేదా కొంచెం ఎక్కువగా ఉండొచ్చని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి.

త్వరలో పెళ్లి?
హార్దిక్ పాండ్యా , మహికా శర్మ జంట గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి బయట కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టడం వల్ల అభిమానులు ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనుకుంటున్నారు. మహికా శర్మ పుట్టినరోజు వేడుకలో వేసుకున్న చిన్న మినీ గౌను ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. స్టైలిష్ డిజైన్, ఖరీదైన బ్రాండ్, లక్షల్లో ఉన్న ధర చిన్న గౌనును ప్రత్యేకంగా మార్చేశాయి.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×