Toxic Warning: “టాక్సిక్” …యష్ ఫ్యాన్స్ చాలా కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ .KGF సిరీస్ తర్వాత యష్ మార్కెట్ ప్యాన్ ఇండియా అయిపోవడంతో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి.డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో వదులుతున్న అప్ డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ నుండి నుంచి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది.
సినిమా కేవలం పెద్దవాళ్లకు (Adults Only) మాత్రమే
ఈ సినిమా నిర్మాత కే ఎల్ వెంకటనారాయణ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలోడైరెక్ట్‌గా ఒక బాంబు పేల్చారు. “టాక్సిక్” సినిమా కేవలం పెద్దవాళ్లకు (Adults Only) మాత్రమేనని, కంటెంట్ ఆ స్థాయిలో ఊరమాస్‌గా ఉండబోతోందని స్పష్టం చేశారు.చిన్న పిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ముందే వార్నింగ్ ఇచ్చేశాడు.అంటే ముందుగా ఊహించినట్టుగానే సినిమాలో బ్లడ్ బాత్ పారడం పక్కా అన్నమాట.
also read :“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!
ఇక ఇప్పటికే సినిమాలో వైలెన్స్, బోల్డ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయన్న రూమర్స్ కి క్లారిటీ వచ్చేసింది.ఈ సమయంలో ఏకంగా సినిమా నిర్మాతే సినిమాకి చిన్న పిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలని చెప్పడం తో అసలు అంతగా వైల్డ్ అండ్ వైలెంట్ సీన్స్ ఏముండబోతున్నాయా అని ఇప్పటి నుండే ఆలోచనలో పడ్డారు మూవీ లవర్స్.
ఆగస్ట్ 27న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్
గతంలో సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ లాంటి సినిమాలతో ఏ సెంటర్, బి సెంటర్ అనే తేడా లేకుండా థియేటర్లను షేక్ చేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా అదే బాటలో నడుస్తుందా అన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.
అయితే రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, దానికితోడు ‘KGF’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మరోసారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక వచ్చే నెల ఆగస్ట్ 8న ట్రైలర్ వదలనున్న మేకర్స్ ,అదే నెల 27న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్యాన్ ఇండియా స్టార్స్ ఇందులో నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగిస్తుంది. చూడాలి మరి చిన్న పిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్నవాళ్లు అసలు రావొద్దు అంటూ అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో !
also read :ఏంటీ..ఒడిస్సీ కి ఇండియాలో వంద కోట్లా ?