E-Paper
Advertisement

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!
Advertisement

Toxic Story:టాక్సిక్ ..గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నాడు అనగానే అంచనాలు పెరిగిపోయాయి.మాకు మళ్ళీ వెయ్యి కోట్ల బొమ్మ ఆన్ ది వే అంటూ మురిసిపోయారు మూవీ లవర్స్.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ లీక్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే సినిమా కథ ఇదే నంటూ ఒక సాలిడ్ రూమర్ నెట్టింట చక్కర్లు కొట్టేస్తుంది.

సినిమా కథ 1947 నుంచి 1961 మధ్యకాలంలో

Advertisement

ఇక వినిపిస్తున్న స్టోరీని చూస్తే..సినిమా కథ 1947 నుంచి 1961 మధ్యకాలంలో గోవాలో పోర్చుగీసుల పాలన సాగుతున్న రోజుల్లో మొదలవుతుందని తెలుస్తుంది. ఇక అప్పటి గోవా నౌకాశ్రయాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, అక్రమ వ్యాపారాలు, శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాల మధ్య జరిగే ఆధిపత్య పోరాటాల చుట్టూ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ కథను అద్భుతంగా మలిచారని ఇన్ సైడ్ టాక్.

also read :జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

ఇక ఈ సినిమా అధికారం కోసం జరిగే పోరాటాలు, హద్దుల్లేని అత్యాశ, గ్యాంగ్ వార్స్, టామీ గన్స్‌తో పేలే భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నాయట.అలా అప్పటి అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని అత్యంత రియలిస్టిక్‌గా, విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించారని సమాచారం.

గ్యాంగ్‌స్టర్ కథ మాత్రమే కాదండోయ్

అయితే ఇది కేవలం ఒక మామూలు గ్యాంగ్‌స్టర్ కథ మాత్రమే కాదండోయ్…అంతకు మించిన అదిరిపోయే ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా. గుండెలను పిండేసే ప్రేమకథ, ప్రాణంగా భావించే అన్నాచెల్లెళ్ల అనుబంధం, తండ్రీకొడుకుల మధ్య రగిలే ప్రతీకార జ్వాలలు మొదలైనవన్నీ ఈ చిత్రానికి అసలైన ప్రాణమని తెలుస్తోంది.

ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన కేజీఎఫ్ సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఏ స్థాయిలో వర్కవుట్ అయిందో మనందరికీ తెలిసిందే, అలాగే టాక్సిక్‌లో కూడా కుటుంబ బంధాలు, ప్రతీకారం వంటి అంశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తాయని టాక్. మొత్తానికి యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ బాండింగ్ కలగలిపిన ఒక మైండ్ బ్లోయింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని మనకు అందించేందుకు గీతా మోహన్ దాస్ సిద్దమైపోయిందన్న మాట.

చూడాలి మరి ఆగస్ట్ 8న వదలనున్న ట్రైలర్ లో ఇంకెన్ని దాచి ఉంచాడో !

also read :బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×