Portronics Pure Sound Pro X2: సౌండ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. అందుబాటు ధరలో మంచి ఆడియో సిస్టమ్ కోసం చూసే వారికి పోర్ట్రానిక్స్ మంచి ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది. ‘పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2’ పేరుతో కొత్త 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన సౌండ్, మోడరన్ డిజైన్‌తో వచ్చిన ఈ డివైజ్ ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందిస్తుంది.
ఈ హోమ్ థియేటర్ అసలు ధర రూ.9,999 కాగా.. ప్రారంభ ఆఫర్ కింద కేవలం రూ.5,999కే అందిస్తున్నారు. ఇది క్లాసిక్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక.
Also Read: అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?
పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 మొత్తం 150W ఆడియో అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఈ సెటప్‌లో మూడు డ్రైవర్లు ఉన్న సౌండ్‌బార్, శక్తివంతమైన సబ్‌వూఫర్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి ఇంట్లోని ప్రతి మూలకూ స్పష్టమైన ఆడియోను అందిస్తాయి. దీని రిమోట్ ద్వారా మ్యూజిక్, మూవీ, న్యూస్, నైట్ అనే నాలుగు ఈక్యూ మోడ్స్‌ను మార్చుకుంటూ నచ్చిన విధంగా ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు.
ఈ సిస్టమ్‌లో లేటెస్ట్ బ్లూటూత్ 5.3తో పాటు హెచ్‌డీఎమ్‌ఐ (ARC), ఆప్టికల్, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లేదా గేమింగ్ కన్సోల్‌లకు దీనిని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. శాటిలైట్ స్పీకర్ల కోసం 5 మీటర్ల కేబుల్స్ ఇస్తుండటంతో వీటిని ఇంట్లో నచ్చిన చోట అమర్చుకోవడం చాలా తేలిక. బాక్స్‌లోనే వాల్-మౌంటింగ్ యాక్సెసరీస్ కూడా లభిస్తాయి.
Also Read: గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?