E-Paper
Advertisement

Toxic vs Dhurandhar 2: మార్చి 19న బాక్సాఫీస్ యుద్ధం.. తగ్గేదెలే అంటున్న హీరోలు..!

Toxic vs Dhurandhar 2: మార్చి 19న బాక్సాఫీస్ యుద్ధం.. తగ్గేదెలే అంటున్న హీరోలు..!

Toxic vs Dhurandhar 2: ఈ సంవత్సరం..మార్చి 19, 2026 తేదీ.. సినిమా అభిమానులకు చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే అదే రోజున రెండు భారీ సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అవే టాక్సిక్.. ధురందర్ 2. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద.. గట్టి పోటీ తప్పదని ఇప్పటికే స్పష్టమవుతోంది.

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రంలో యష్ హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటన్నింటినీ ఖండిస్తూ నిర్మాతలు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ద్వారా టాక్సిక్ సినిమా మార్చి 19ననే విడుదల అవుతుందని స్పష్టంగా ప్రకటించారు. అలాగే యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇక ధురందర్ 2 గురించి మాట్లాడుకుంటే..ఇది ధురందర్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. ధురందర్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సంచలనంగా మారింది. అందుకే ధురందర్ 2పై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ పార్ట్‌లో రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ధురందర్ 2ను ఈసారి కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. దీంతో ఇది పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నిర్ణయం టాక్సిక్ సినిమాపై.. ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఒకే రోజు విడుదల కావడం వల్ల టాక్సిక్..ధురందర్ 2 మధ్య భారీ బాక్సాఫీస్ యుద్ధం ఖాయం. యష్ అభిమానులు..రణవీర్ సింగ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ తమ సినిమాలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

ఏదేమైనా..మార్చి 19న విడుదల కాబోతున్న టాక్సిక్.. ధురందర్ 2 సినిమాలు ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయం. ఒకవైపు యష్ పాన్ ఇండియా ఇమేజ్.. మరోవైపు ధురందర్ పార్ట్ 1 సృష్టించిన భారీ రికార్డులు ఈ పోటిని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏ సినిమా కథ, నటన, మేకింగ్ పరంగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో అదే బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుంది. ఈ క్లాష్ వల్ల థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొనడం మాత్రం షురూ.

ALSO READ: Prabhas:స్పిరిట్ విషయంలో ప్రభాస్‌కు సందీప్ మరో కండీషన్… డార్లింగ్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×