Vastu Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరినీ అడగకూడని లేదా ఎవరికీ అప్పుగా ఇవ్వకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక మైన శక్తి ఉంటుంది. కొన్ని వస్తువులు సానుకూలతను పెంచుతాయి. అయితే మరి కొన్ని మాత్రం ప్రతికూల ప్రభావాలను సృష్టిస్తాయి. ఇదెలా ఉంటే మరికొన్ని వస్తువులను తప్పుడు సమయంలో లేదా తప్పు మార్గంలో ఇవ్వడం లేదా తీసుకోవడం చేయడం వల్ల మీ జీవితంలో ప్రతి కూలత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు ఎవరికైనా ఏదైనా అప్పుగా ఇవ్వాలని లేదా ఎవరినైనా ఏదైనా అడగాలని ఆలోచిస్తుంటే.. వాస్తు నియమాలను ఖచ్చితంగా తెలుసుకోండి.
తెల్ల ఆహార పదార్థాలు:
తెల్లటి ఆహార పదార్థాలు శక్తి, శ్రేయస్సును సూచిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం పాలు, పెరుగు, బియ్యం, ఉప్పు మొదలైన తెల్లటి ఆహార పదార్థాలను ఇవ్వడం అశుభ కరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది శక్తి పరివర్తన సమయం. సాయంత్రం ఇంటి నుంచి ఈ వస్తువులను పంపడం వల్ల ఇంటి శ్రేయస్సు తగ్గుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కాబట్టి.. ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే ఇలాంటి వస్తువులను మార్పిడి చేసుకోవడం ఉత్తమం.
చీపురు:
మీ ఇంటి చీపురును ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. వాస్తు ప్రకారం.. చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. వేరొకరి చీపురును ఉపయోగించడం వల్ల వారి ఇంటి నుంచి ప్రతి కూల శక్తి మీ ఇంటిలోకి వస్తుంది. ఇది ఆర్థిక సమస్యలను కూడా పెంచుతుంది.
చేతి గడియారం:
గడియారాన్ని సమయం, అదృష్టం, పురోగతి , జీవిత వేగానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే.. మీ చేతి గడియారాన్ని వేరొకరికి ఇవ్వడం లేదా వేరొకరి గడియారాన్ని ధరించడం అశుభంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు మీ వాచ్ వేరొకరికి ఇచ్చినప్పుడు, వారికి మీ శక్తిని, మంచి సమయాలను కూడా ఇస్తున్నారు అని అర్థం. అదే విధంగా.. వేరొకరి వాచ్ మీరు ధరించడం వల్ల వారి మంచి లేదా చెడు శక్తి కూడా మీ జీవితం లోకి వస్తుంది.
Also Read: ఇంట్లో వాస్తు దోషాలతో విసిగిపోయారా? ఈ 6 నివారణలతో మీ కష్టాలకు స్వస్తి !
కర్చిఫ్:
ఇది శుభం, దురదృష్టంతో ముడి పడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి వ్యక్తి గత భావోద్వేగాలు, మానసిక స్థితి శక్తిని గ్రహిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు మీ కర్చీఫ్ ఎవరికైనా ఇచ్చినప్పుడు లేదా వేరొకరి కర్చీఫ్ మీరు వాడి నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ప్రతి కూల శక్తి కూడా మీకు బదిలీ అవుతుంది. అదే విధంగా.. కర్చీప్ ఎవరికీ బహు మతిగా ఇవ్వ కూడదు. ఇది సంబంధాలను దెబ్బ తీస్తుందని నమ్ముతారు. అందుకే పొరపాటున కూడా కర్చిప్ బహుమతి గా ఇవ్వ కూడదు.
Also Read: మర్చిపోయి కూడా వీటిని గిఫ్ట్‌గా ఇవ్వకండి.. ఇస్తే కష్టాలు తప్పవు!