E-Paper
Advertisement

Trisha Controversy: వైరల్ వీడియో వివాదంలో పార్థిబన్‌పై సీరియస్ అయిన నటి త్రిష

Trisha Controversy: వైరల్ వీడియో వివాదంలో పార్థిబన్‌పై సీరియస్ అయిన నటి త్రిష
Advertisement

Trisha Controversy: దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల నటుడు విజయ్‌తో కలిసి ఆమె ఒక వివాహ వేడుకలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వీడియోపై నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-Illu Illalu Pillalu Today Episode: ప్రేమ ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. కరిగిపోయిన వేదవతి.. అయ్యో వల్లికి మళ్ళీ షాక్..

వివాదం ఎక్కడ మొదలైంది?

Advertisement

ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రముఖుడి వివాహ వేడుకకు నటుడు విజయ్, త్రిష ఒకే కారులో రావడం, అక్కడ కలిసి కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గతంలో ‘లియో’ సినిమా సమయంలో కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. తాజా వీడియోతో ఆ పుకార్లకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్థిబన్, త్రిషపై పరోక్షంగా చౌకబారు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. “కుందవై (పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో త్రిష పాత్ర) వంటి వారు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. ఇలా బయట కనిపిస్తే అనవసరమైన గందరగోళాలు, చర్చలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన భార్యతో ఉన్న సంబంధాలను కూడా ఈ చర్చలోకి లాగడం చర్చనీయాంశమైంది.

Read also-Highest Paid Telugu Hero and Heroine: టాలీవుడ్‌లో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..!

త్రిష ఘాటు కౌంటర్

Advertisement

పార్థిబన్ వ్యాఖ్యలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన త్రిష, సోషల్ మీడియా వేదికగా ఆయనకు గట్టి సమాధానం ఇచ్చారు. ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. “కొంతమంది వ్యక్తులకు ఉన్న తెలివితేటలు లేదా వారు సాధించిన విజయాలు, ఇతరుల పట్ల వారు చేసే అగౌరవ వ్యాఖ్యలను సమర్థించలేవు. మూర్ఖత్వం, అసూయ కలగలిసినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. వాటికి సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండటం మేలని అనిపించినా, కొన్నిసార్లు గళం విప్పక తప్పదు.” అంటూ చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. ఒక వర్గం వారు పార్థిబన్ తన అభిప్రాయాన్ని చెప్పారని అంటుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం త్రిషకు మద్దతు తెలుపుతున్నారు. ఒక సీనియర్ నటుడిగా, మేధావిగా పేరున్న పార్థిబన్ ఒక మహిళా నటి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి అనాగరిక కామెంట్స్ చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×