E-Paper
Advertisement

Social drama OTT: పెళ్లయినా పనికిరాని మొగుడు.. అత్తకు దగ్గరగా… ఇది మామూలు కథ కాదు

Social drama OTT: పెళ్లయినా పనికిరాని మొగుడు.. అత్తకు దగ్గరగా… ఇది మామూలు కథ కాదు
Advertisement

Social drama OTT : సోషల్ మెసేజ్ తో వచ్చే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. వచ్చిన వాటిలో నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకించి కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తాయి మహిళలకి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ మరాఠీ మూవీ అంత అద్భుతంగా ఉంటుంది మరి. ఒక మహిళ అటు అత్తారింట్లో, ఇటు పుట్టింట్లో ఎదుర్కొనే సంఘర్షణ ఈ సినిమా. ఇదొక మామూలు సినిమా కాదు, ప్రతి ఆడపిల్ల చూడాల్సిన ఒక ధైర్యవంతురాలి కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

ఈ మరాఠీ సోషల్ డ్రామా మూవీ పేరు ‘వెల్కమ్ హోమ్’ (Welcome Home). ప్రముఖ దర్శకులు సుమిత్రా భావే, సునీల్ సుక్తాంకర్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో మృణాల్ కుల్కర్ణి, సుమీత్ రాఘవన్, స్పృహ జోషి, మోహన్ అగాషే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. పార్థ్ ఉమ్రాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని “రాధే రాధే”, “కిర్ రాన్” “యా ఖుదా” వంటి పాటలు కథలోని ఎమోషన్స్ కు చక్కగా సరిపోతాయి. ఇక మృణాల్ కుల్కర్ణి ఉత్తమ నటిగా, సుమిత్రా భావే ఉత్తమ రచయిత్రిగా క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ (2020) ను కూడా గెలుచుకున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ సౌదామిని అనే ఒక ఇల్లాలు చుట్టూ తిరుగుతుంది. బాగా చదువుకున్న అమ్మాయే కానీ, పెళ్లయ్యాక భర్తతో గొడవలు, మనస్పర్థల వల్ల సంసారం నరకంలా తయారవుతుంది. ఇక అక్కడ ఉండలేక, ఒక రోజు తన కూతురిని, తనని ప్రాణంలా చూసుకునే అత్తగారిని వెంటబెట్టుకుని పుణెలో ఉన్న తన పుట్టింటికి వచ్చేస్తుంది. భర్తను వదిలేసి రావడం అంటే అప్పట్లో ఏదో తప్పు చేసినట్టు చూసేవారు కాబట్టి, ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది. ఇక పుట్టింటికి వచ్చాక కూడా ఆమెకు ప్రశాంతత దొరకదు. మగాడు అన్నాక కాస్త అటు ఇటుగా ఉంటాడు, సర్దుకుపోక ఏంటి ఈ గొడవలు? అని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు సూటిపోటి మాటలు అంటుంటారు.

ఇక తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలని, ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని ఆమె పడే తాపత్రయం, ఆ క్రమంలో ఆమె ఎదుర్కొనే అవమానాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. చివరికి సౌదామిని తన కాళ్ళమీద నిలబడుతుందా ? ఈ సమాజాన్ని ఎదిరించి బతకగలుగుతుందా ? అసలు ఆమెకు భర్తతో వచ్చిన విబేధాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : తాత ఆఖరి కోరిక… మెంటలెక్కించే మనవరాలు… క్లైమాక్స్ వరకు నవ్వులే

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×