E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును రోడ్డు మీద చూసిన రేఖ  

Brahmamudi Serial Today march 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును రోడ్డు మీద చూసిన రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: 

ఎగ్జామ్‌ రాస్తూ కాపీ కొడుతూ ఐశ్వర్య దొరికిపోతుంది. ఒక్కసారి వదిలేయండి సార్‌ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. ఎగ్జామినర్‌ అసలు వదలడు.. దీంతో ఐశ్వర్య తన ఫ్రెండ్స్‌ దగ్గర కూడా స్లిప్స్‌ ఉన్నాయని చెప్తుంది. దీంతో అందరిని పట్టుకుని బయటకు గెంటేస్తాడు ఎగ్జామినర్‌.. మాస్క్‌ పెట్టుకున్న కావ్య అంతా చూస్తూ.. త్వరగా ఎగ్జామ్‌ రాసి వెళ్లిపోవాలి లేదంటే రేఖ ఆంటీ వచ్చేస్తుంది అనుకుంటుంది.

మరోవైపు ఆఫీసులో రేఖ మీటింగ్‌ హాల్ల్‌లో కోపంగా నిలబడి ఉంటుంది. భూషణ్‌, చక్ర కూర్చుని సీరియస్‌గా డిష్కస్‌ చేస్తుంటారు. చక్రి కోపంగా బిజినెస్‌ డెవలప్‌ చేస్తానని చెప్పి పది కోట్లు అప్పు తీసుకున్నావు.. టూ ఇయర్స్‌ లో ఇస్తానని ఫైవ్‌ ఇయర్స్‌ చేశావు.. గ్యారటీ లేదు కానీ స్టోరీలు చెప్తూనే ఉన్నావు.. ఇక నీ మీద నమ్మకం పోయింది భూషణ్‌ వెయిట్‌ చేయడం కుదరదు.. అనగానే.. భూషణ్‌ వడ్డీ టైంకు కడుతున్నాం కదా చక్రి అని చెప్పగానే.. చక్రి కోపంగా వడ్డీ కడుతున్నాం కదా అని  అలసు వదులుకోలేను కదా అంటాడు.. దీంతో భూషణ్‌ నాకు కొంచెం టైం ఇస్తే అని అడగ్గానే.. భూషణ్‌ నేను బిజినెస్‌ మ్యాన్‌ ను నాకు తెలిసింది రెండే రెండు రూల్స్.. ఒకటి కంపెనీకి ఫ్యూచర్‌ ఉందంటే ఇన్వెస్ట్‌ చేస్తాను.. లేదంటే ఆ కంపెనీని క్యాప్చర్‌ చేస్తాను. నీ కంపెనీ విషయంలో కూడా అది నమ్మే పది కోట్లు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నీ కంపెనీకి ఫ్యూచర్‌ లేదు కాబట్టి నీ కంపెనీని నాకు రాసి ఇవ్వమంటున్నాను.. నీ కంపెనీ నాకు రాసి ఇస్తున్నట్టుగా డాక్యుమెంట్స్‌ అన్ని రెడీ చేశాను. ఒక్క చిన్న సైన్‌ చేస్తే చాలు నీ అప్పు మొత్తం తీరిపోతుంది. సంతకం నీది.. కంపెనీ నాది అని చెప్పగానే..

Advertisement

అంత సేపు సీరియస్‌గా చూస్తున్న రేఖ ఏంటి భూషణ్‌ ఆలోచిస్తున్నావు.. సంతకం చేయ్‌.. ఇంత మంచి డీల్‌ వచ్చినప్పుడు ఫినిష్‌ చేయడమే మంచిది అని చెప్పగానే.. చక్రి కోపంగా ఏంటి రివర్స్‌ గేమ్‌ ఆడుతున్నావా..? అనగానే.. రేఖ.. చక్రి నేను ఏదైనా స్ట్రెయిట్‌ గానే ఫినిష్‌ చేస్తాను. ఇప్పుడు మా భూషణ్‌ కంపెనీ లాస్‌లో ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని కొంటె.. కంపెనీతో పాటు అప్పులు కూడా నీవే అవుతాయి. నీ అప్పు తీరిపోయి నా నుంచి మాకు ఫ్రీడమ్‌ వస్తుంది. చక్రి తెలివైన బిజినెస్‌ మ్యాన్ ఎప్పుడూ లాభం తీసుకొచ్చేదాని మీదే ఇన్వెస్ట్‌ చేస్తాడు కానీ చెత్తను కొనాలి అనుకోడు.. అని చెప్పగానే.. వాట్‌ యూ మీన్‌ అని అడగ్గానే.. సింపుల్ చక్రి.. నీకు స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్ కంపెనీస్‌ గురించి బాగా తెలుసు అనుకుంటా..? అని చెప్పగానే… చక్రి కొంప దీసి ఆ కంపెనీ నీది అంటావా ఏంటి..? నువ్వు దానికి జస్ట్‌ గార్డియన్ మాత్రమే అసలైన ఓనర్ ఇందు కదా..? అప్‌కోర్స్‌ తనకు ఇంకా సైన్‌ ఫవర్‌ రాలేదనుకో  అనగానే..

కొన్ని రోజుల్లోనే ఆ పవర్‌ దానికి రాబోతుంది. ఆ పవర్‌ దానికి వచ్చి వెంటనే ఆస్థి మొత్తం నాకు రాసిస్తున్నట్టుగా సంతకం చేయడానికి ఇందు సిద్దంగా ఉంది. ఏంటి నమ్మకం కలగడం లేదా..? ఇరవై ఏళ్లుగా దాన్ని నా ఇంట్లో పెట్టుకుని మేపుతుంది ఆ రోజు కోసమే.. అని చెప్పగానే.. చక్రి అనుమానంగా అయినా ఇదంతా ఎందుకు నమ్మాలి అని అడగ్గానే.. రేఖ నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం చక్రి కొన్ని రోజుల్లో స్వరాజ్‌ కంపెనీ నాది అవ్వడం కాయం.. ఒక్కసారి ఇమాజిన్‌ చేసుకో.. ఆ కంపెనీ నా సొంతం అయ్యాక దాన్నుంచి వచ్చే కాంట్రాక్ట్‌ అన్నీ నీకే ఇస్తాను.. వాటి నుంచి వచ్చే లాభంతో పోలిస్తే.. ఈ పది కోట్లు కేవలం చిల్లర.. చిల్లరే అని నీకు బాగా తెలుసు.. మునిగిపోతున్న భూషణ్‌ కంపెనీ  కావాలా..? ప్యూచర్‌ను ఏలబోతున్న ఈ రేఖతో పార్ట్‌నర్‌ షిప్‌ కావాలా..? అప్పులు కావాలా..? కోట్లు గుమ్మరించే కాంట్రాక్ట్స్‌ కావాలా..? ఏంటో నువ్వే తేల్చుకో చక్రి అని రేఖ చెప్పగానే..

Advertisement

చక్రి ఆలోచనలో పడిపోతాడు. చక్రి, భూషణ్ ఈజ్‌ వెయిటింగ్‌.. సంతకం చేయాలా వద్దా..? ఏంటో చెప్పు.. భూషణ్‌ చేసేయ్‌.. అనగానే.. భూషణ్‌ సంతకం చేయబోతుంటే.. నో.. నేను నిన్ను నమ్ముతున్నాను రేఖ అంటాడు. నమ్మడమే కాదు ఇన్వెస్ట్ మెంట్‌ చేయాలి అని చెప్పగానే.. చక్రి వాట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఏంటి..? అనగానే.. ఇన్వెస్ట్‌ మెంట్‌ చేయకుండా ఎక్కడైనా కంపెనీ వస్తుందా..? అంటూ తన మాటలతో చక్రిని రెచ్చగొడుతుంది రేఖ. దీంతో ఇన్వెస్ట్‌ చేయడానికి చక్రి ఓకే చెప్పి రేఖకు చెక్‌ ఇస్తాడు.. చెక్‌ తీసుకుని రేఖ, భూషణ్‌ వెళ్లిపోతారు.

రాజు తన లాప్‌ట్యాప్‌ అమ్మడానికి రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడికి వచ్చిన వ్యక్తికి మాటలు చెప్పి పనికిరాని లాప్‌ట్యాప్‌ అమ్మేస్తాడు. తర్వాత ఇందు ఎగ్జామ్‌ రాసి ఇంటికి వెళ్తుంటే.. కారులో వెళ్తున్న రేఖ చూస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక రేఖ కోపంగా ఇందును నిలదీస్తుంది. అ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇందు, అపర్ణ, స్వాతి భయపడుతుంటారు.. ఇంతలో ఇందు కూల్‌గా స్వాతి డ్రెస్‌ కుట్టించుకుని తీసుకురమ్మంది అందుకే వెళ్లానని చెప్తుంది. అయినా రేఖ ఇందును అనుమానిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×