Trisha -Vijay.. ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా సింగిల్ గానే కెరియర్ ను కొనసాగిస్తోంది. తన అద్భుతమైన నటనతో రీ ఎంట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే కెరియర్ పరంగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ ఒంటరిగానే ఉండడంతో.. ఈమె ఎన్నో రకాల రూమర్స్ సృష్టించబడుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే గతంలో ప్రభాస్ (Prabhas), శింబు (Simbu) వంటి హీరోలతో ఈమె ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేకపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. త్రిష తో పాటు ఆ ఇద్దరు హీరోలు కూడా ఇంకా సింగిల్ గానే ఉండడం గమనార్హం.
త్రిష వ్యక్తిగత జీవితం పై రూమర్స్ వైరల్..
ఇకపోతే త్రిష కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక బిజినెస్ మాన్ తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ నిశ్చితార్ధాన్ని కాస్త క్యాన్సిల్ చేసుకున్నారు.అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈమె.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) చట్టాపట్టాలేసుకొని తిరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్తున్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేలా ఫోటోలు షేర్ చేస్తున్నారు. కానీ అదే ఫోటోలు వీరు ఒకే చోట ఉన్నారనే విషయాన్ని బయటపెడుతున్నాయి అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..
విజయ్ కోసం త్రిష అన్ని త్యాగాలు చేసిందా?
దీనికి తోడు త్రిష కూడా విజయ్ కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ఆధారాలు కూడా స్పష్టం అవుతున్నాయి అని, ఎందుకంటే త్రిష సాధ్యమైనంత వరకు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడదు.. అలాంటిది విజయ్ కోసం విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది అంటూ ఆధారాలతో సహా వార్తలు వైరల్ చేస్తున్నారు.
అంతేకాదు విజయ్ బాటలోనే తాను కూడా రాజకీయరంగ ప్రవేశం చేస్తానని చెప్పకనే చెప్పిందని.. ఇవి చాలవా వీరిద్దరి మధ్య బంధాన్ని మరింత బలపడేలా చేస్తున్నాయనడానికి ఆధారాలు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన త్రిష – విజయ్..
ఇలా వరుసగా రూమర్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. సడన్గా నిన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో దర్శనం అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోని స్వయంగా త్రిష షేర్ చేయడం ఇప్పుడు అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న విజయ్ దళపతి పుట్టినరోజు.. ఈ సందర్భంగా విజయ్ కి ప్రత్యేకమైన విషెస్ తెలియజేసింది త్రిష. అంతే కాదండోయ్ త్రిష – విజయ్ ఒకే దగ్గర ఉంటూ.. విజయ్ కుక్కపిల్లను ముద్దాడుతుంటే అది చూసి త్రిష మురిసిపోయింది. ఈ ఫోటోని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే ఈ ఫోటో ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఫోటో చూసిన కొంతమంది త్రిష – విజయ్ ఒకే ఇంట్లో ఉన్నారు అనడానికి ఇంతకంటే గొప్ప ప్రూఫ్ కావాలా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారుగా అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్..
అయితే ఈ విషయం ఇలా ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో త్రిష, విజయ్ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఫోటో కింద ‘హ్యాపీ బర్తడే బెస్టెస్ట్’ అని క్యాప్షన్ ఇచ్చింది కదా.. అది చూడలేదా అంటూ కౌంటర్ వేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే చోట కనిపిస్తే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా మండిపడుతున్నారు. ఏది ఏమైనా త్రిష , విజయ్ కి సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై ఈ జంట ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
ALSO READ:Chiranjeevi: 70 ఏళ్ల వయసులో ఇదేం పాడు బుద్ధి చిరు.. కూతురు లాంటి అమ్మాయితో ఛీ.. ఛీ..
Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn
— Trish (@trishtrashers) June 22, 2025