Seaplane: పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టింది చంద్రబాబు సర్కార్. టూరిస్టులను ఆకట్టుకునేందుకు సీప్లేన్ కీలకమని భావించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎనిమిది ప్రాంతాల్లో ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని డిసైడ్ అయ్యింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి సర్వీసులు ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది.
పర్యాటక రంగంపై అధికంగా ఫోకస్ చేశారు చంద్రబాబు సర్కార్. పర్యాటకులకు అనుగుణంగా టెంట్ సిటీలను నిర్మించాలని భావించింది. దానికి తెరవెనుక పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా సీప్లేన్ సర్వీసులపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి సర్వీసులు మొదలుపెట్టాలని బలంగా స్కెచ్ వేసింది.
అందుకోసం 11 ప్రాంతాలను గుర్తించింది ప్రభుత్వం. అందులో ఎనిమిది ప్రాంతాల నుంచి సీ ప్లేస్ సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. వాటిలో ప్రకాశం బ్యారేజ్, అరకు, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కోనసీమ, శ్రీశైలం, తిరుపతి తొలి ఫేజ్‌లో ఆయా ప్రాంతాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఎనిమిది ప్రతిపాదిత ప్రదేశాలలో ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్య అధ్యయనాన్ని చేపట్టింది. వివిధ సంస్థల నుండి అవసరమైన అనుమతులను పొందనుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే వచ్చే జనవరి నాటికి పట్టాలపైకి ఎక్కించాలని నిర్ణయించింది.
ALSO READ: మరింత సౌకర్యవంతంగా విజయవాడ టు చెన్నై జర్నీ
ఎనిమిది ప్రదేశాలలో వాతావరణంపై అధ్యయనం చేయనుంది. సైట్ సర్వే, CRZ మ్యాపింగ్, జెట్టీ స్థానాన్ని గుర్తించడం చేయనుంది. అలాగే సీప్లేన్ కోసం రన్‌వే, అనుబంధ మౌలిక సదుపాయాలు, సాధ్యాసాధ్యాల అధ్యయనం చేయనుంది. అధికారుల నుండి అవసరమైన పరిపాలనా అనుమతుల మంజూరు వంటివి నిర్వహించడం జరుగుతుంది.
DPR తయారీలో వాటర్ డ్రోమ్‌ల నిర్వహణ మొదలు.. లేఅవుట్ ప్రణాళిక వరకు అన్నీ అందులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ రంగంలో అనుభవజ్ఞులైన వారిని సలహాదారుగా నియమించనుంది. వాటర్ డ్రోమ్‌కు చట్టబద్ధమైన అనుమతులు పొందడం వంటి అంశాలను వారికే అప్పగించాలని భావిస్తోంది. నీటి విమానాశ్రయాల నిర్వహణ కోసం చట్టబద్ధమైన అనుమతులను పొందడం, ఎయిర్‌లైన్ ఆపరేటర్‌కు అప్పగించే వరకు ప్రాజెక్ట్ అమలు మద్దతు సలహాదారుడి బాధ్యతని కావచ్చని ఓ అధికారి తెలిపారు.
గతేడాది నవంబరు 9న ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది చంద్రబాబు సర్కార్. సుమారు 150 కిలోమీటర్ల విహారంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు ప్రయాణం చేశారు. రాష్ట్రం నుంచి ఈ సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. భూమి ఉపరితలం నుంచి 1,500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణం చేయనున్నాయి.