BigTV English
Advertisement

Actor Bramhaji : మంచు మోహన్ బాబు అబద్దం చెప్పాడు… దాన్ని మీరందరూ నమ్మేశారు..

Actor Bramhaji : మంచు మోహన్ బాబు అబద్దం చెప్పాడు… దాన్ని మీరందరూ నమ్మేశారు..

Actor Bramhaji : సినీ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బ్రహ్మాజీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నాడు. మొన్నామధ్య పుష్ప 2 గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.. తాజాగా మోహన్ బాబు గురించి ఓ నిజాన్ని ట్వీట్ చేశారు.. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతుంది. అందులో ఏం రాశాడంటే..


మోహన్ బాబు 7వేల ఎకరాల పై బ్రహ్మాజీ ట్వీట్.. 

ఇటీవల కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఫన్నీ వీడియోని టీం వదిలింది. బ్రహ్మాజీ ఈ వీడియోని తీస్తుండటం.. అందులో మోహన్ బాబు ఏడు వేల ఎకరాలు కొన్నట్టుగా చెప్పడం.. బ్లాక్ మనీ గురించి మాట్లాడటం జరిగింది. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. చూస్తుంటూనే అది అబద్దం అని అర్థం అవుతోంది.. అయిన వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే అటు ఇండస్ట్రీలోను, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తాజాగా నటుడు బ్రహ్మాజీ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు.. ఆయన.. మేం అంతా అలా ఏదో సరదాగా ముచ్చట్లు పెట్టుకుని జోకులు వేసుకున్నాం.. కానీ ఇదంతా కూడా నిజం అని కొంత మంది నమ్ముకుంటున్నారు..


అరె బై.. న్యూజిలాండ్‌లో ఏడు వేల ఎకరాలు కొనడం అంత ఈజీ అనుకుంటున్నారా? అలా అయితే ప్రతీ వీకెండ్ అక్కడికి వెళ్లి షూటింగ్ చేసి వచ్చే వాళ్లం.. జోక్స్‌ని జోక్స్‌లా చూడండి.. హెడ్ లైన్స్ చేయకండి.. అక్కడి సిటిజన్స్ కాకుండా వేరే వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొనడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఒప్పుకోదు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి అంటూ ఆ ట్వీట్లో బ్రహ్మాజీ రాసుకోచ్చాడు. ఇది వైరల్ అవ్వడంతో.. జనాలను బకరాలను చేశారు కదరా అంటూ ఆయన ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..

Also Read :పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. ఆ ఒక్కటి వెరీ కాస్ట్లీ..!

కన్నప్ప మూవీ.. 

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా రాబోతున్న కన్నప్ప మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఈ సినిమాను సమ్మర్ కి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. జూన్ 27న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ట్రైలర్, టీజర్ లాంచ్ ఈవెంట్లు నిర్వహించారు. పలు నగరాల్లో కన్నప్ప కోసం ఈవెంట్లు చేశారు. చివరగా హైదరాబాద్‌లో కన్నప్ప ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ కన్నప్ప నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.. ఈ మూవీకి మొదట్లో విపరీతమైన నెగెటివిటీ ఉండేది. కానీ ఇప్పుడేమో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్స్లో జోరుని పెంచారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. మరి థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Raj Tarun : కొత్త అవతారం ఎత్తబోతున్న హీరో.. రిస్క్ అవసరమంటావా..?

Srinivas Reddy: చైతూ కోసం 10 నెలల కష్టం వృధా.. ఆ సూపర్ హిట్ సీక్వెల్ పై డైరెక్టర్ కామెంట్!

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Big Stories

×