Chiranjeevi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి.. ఎవరి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని నేడు మెగాస్టార్ గా నిలిచారు చిరంజీవి (Chiranjeevi). తన అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకులను అబ్బురపరచడమే కాదు.. తన సహాయ గుణంతో కర్ణుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలు చూసిన చిరంజీవి.. అటు వ్యక్తిగతంగా కూడా ఏ రోజు విమర్శలు ఎదుర్కొన్న రోజు లేదు. కానీ 70 ఏళ్ల వయసులో ఆయన మనసులో చిగురించిన కోరికలు ఆయనపై విమర్శలు కలిగేలా చేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కూతురు లాంటి అమ్మాయిపై మనసు పారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చిరంజీవి పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కుబేర థాంక్స్ మీట్ లో చిరంజీవి..
అసలు విషయంలోకి వెళ్తే.. నాగార్జున(Nagarjuna ), ధనుష్ (Dhanush)కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఇటీవల జూన్ 20న విడుదల అయ్యి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర బృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ మీట్ కి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ రష్మిక గురించి మాట్లాడుతూ చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
నేషనల్ క్రష్ పై మనసు పారేసుకున్న మెగాస్టార్..
ఈ థాంక్స్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. “రష్మిక మొదటి సినిమాకు నేను గెస్ట్ గా వచ్చాను. అప్పటినుంచి రష్మికను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సినిమాకి నటనలో ప్రతిభ పెంచుకుంటూ నేషనల్ క్రష్ అయింది. నేషనల్ క్రష్ మాత్రమే కాదు నా క్రష్ కూడా.. అయితే ఈ మాట నేను మనసులో మాత్రమే అనుకుంటాను.. బయటకి ఎవరికీ చెప్పను అంటూ మనసులో మాటను బయటపెట్టారు చిరంజీవి. అయితే చిరంజీవి చెప్పిన మాటలతో అక్కడ అందరూ చప్పట్లతో, నవ్వులతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.
చిరంజీవిపై నెటిజన్స్ ట్రోల్స్..
అయితే చిరంజీవి సరదాగా ఈ కామెంట్స్ చేసినా.. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో.. కూతుర్లాంటి అమ్మాయి పై ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి.. ఛీ.. ఛీ.. అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేయడం గమనార్హం. ఏది ఏమైనా చిరంజీవి సరదాగా అన్న మాటలు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కు దారితీసాయని చెప్పవచ్చు.
చిరంజీవి సినిమాలు..
మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వం లో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. మరొకవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
ALSO READ:Kannappa: కన్నప్ప బ్రహ్మణ వివాదం… మూవీలో కీలక సీన్స్ కట్!
Boss Timing ❤️😂🔥
Rashmika❌National Crush✅@KChiruTweets @iamRashmika #chiranjeevi #KuberaaBlockbuster pic.twitter.com/I3FWAmhMNc
— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 22, 2025