E-Paper
Advertisement

Trisha: త్రిషకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు.. చూడండి, ఫ్రెండ్స్‌తో ఎలా ఎంజాయ్ చేస్తుందో?

Trisha: త్రిషకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు.. చూడండి, ఫ్రెండ్స్‌తో ఎలా ఎంజాయ్ చేస్తుందో?
Advertisement

Trisha: స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) పేరు ఈ మధ్య ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ (Kollywood Star Hero Vijay)తో ఆమె సహజీవనం చేస్తోందంటూ గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్తలు కాస్తా, రీసెంట్‌గా వారిద్దరూ కలిసి ఓ పెళ్లికి అటెండ్ అయిన వీడియో చాలా వరకు క్లారిటీ ఇచ్చేసింది. విజయ్‌తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకకు హాజరుకావడం.. వారి మధ్య ఎఫైర్ నడుస్తుందనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చినట్లయింది. వీరిద్దరూ కలిసి వేడుకకు రావడం, ఒక జంటలాగే తిరిగి వెళ్లడం చూసి నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు భారీ మొత్తంలో భరణం ఇవ్వాలని చూస్తున్నట్లుగా కూడా టాక్ నడిచింది. విజయ్ భార్య సంగీత (Sangeetha) విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కినట్లుగా వచ్చిన వార్తలతో విజయ్ జీవితంలో త్రిష ఎంటరైందనే అభిప్రాయానికి అంతా వచ్చేశారు.

Also Read- Allu Arjun: మరో సంచలన నిర్ణయం.. అసలు అల్లు అర్జున్ స్కెచ్ ఏంటి?

చీమ కూడా కుట్టినట్టులేదు

Advertisement

మరో వైపు తమిళనాడు రాజకీయ వర్గాల్లో కూడా విజయ్-త్రిషల సంబంధం (Vijay and Trisha Relation)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిషతో బంధం నిజమే అనేలా పిక్చర్ కనబడుతుండటంతో విజయ్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ఆయనని ఎంతగానో అభిమానించే వారు కూడా ఈ లింక్‌తో దూరమవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో విజయ్ ఫాలోయర్స్ సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఇంత జరుగుతున్నా, త్రిష మాత్రం తనను చీమ కూడా కుట్టనట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ వార్తలన్నింటికీ దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ విషయం శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే తెలుస్తుంది. శుక్రవారం ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలను చూసిన వారంతా.. ఇదే మాట అనుకుంటున్నారు.

Also Read- Godari Gattupaina: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్రల మ్యాజికల్ మెలోడీ ‘బంగారు బొమ్మ’.. ఎలా ఉందంటే?

స్నేహితులతో కలిసి ఎంజాయ్..

Advertisement

ఈ ఫొటోల్లో త్రిష తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత డిజైనర్ సిడ్నీ స్లాడెన్‌తో పాటు ఇతర ఫ్రెండ్స్‌తో దిగిన ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ల ద్వారా త్రిష ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తనపై వస్తున్న రాజకీయ విమర్శలు, రూమర్స్ గురించి తాను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, స్నేహితులతో తన వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానని ఆమె ఈ పోస్ట్‌ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. అంతేగా మరి, అసలోడే వెంటేసుకుని తిరుగుతుంటే.. ఇంక తనకి భయమేం ఉంటుంది. అన్నట్టు రాబోయే ఎన్నికలలో త్రిష కూడా విజయ్ పార్టీ తరపున పోటీ చేస్తుందని అంటున్నారు. ఇంకా ఈ జంట గురించి ఎన్నెన్ని వినాల్సి వస్తుందో.. వెయిట్ అండ్ సీ..

Also Read- Chiranjeevi: ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరన్నారుగా.. మరి చిరంజీవినే ఎందుకు కలుస్తున్నారు?

Related News

రష్మిక రణబాలి ఒకే చేయడానికి అతనే కారణమా? విజయ్ మాత్రం కాదండోయ్!

సీరియల్‌లో రూ.750తో మొదలు.. ఇప్పుడు కోట్లలో పారితోషికం! రచితా రామ్ జర్నీ ఇదే

‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

Big Stories

Advertisement
×