E-Paper
Advertisement

Romantic Drama OTT: టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్… రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ

Romantic Drama OTT: టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్…  రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ
Advertisement

Romantic Drama OTT : టీచర్, స్టూడెంట్ లవ్ కాన్సెప్ట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సమాజం ఇలాంటి ప్రేమను పెద్దగా ఎంకరేజ్ చేయదు. కాని ఇలాంటి కంటెంట్ సినిమాలు కూడా మంచి విజయాలు కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సూపర్ హిట్ తైవానీస్ సిరీస్ గురుంచి చెప్పుకోవాల్సిందే. ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, కథలో వచ్చే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నటీనటుల నటన, సంగీతం దీనికి పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయి కూడా.

ఎక్కడ చూడచ్చు అంటే

2022 లో వచ్చిన ఈ తైవానీస్ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘లెసన్ ఇన్ లవ్’ (Lesson in Love). ఇందులో టిఫానీ హ్సు (టీచర్‌గా), ఎడ్వర్డ్ చెన్ (స్టూడెంట్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. 12 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం iQIYI, Viki ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఐయండిబిలో ఈ సినిమాకు 7.4 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చెన్ మెంగ్యున్ అనే ఒక స్టైలిష్ టీచర్ కొత్తగా ఒక స్కూల్‌కి వస్తుంది. ఆ స్కూల్‌లో జాంగ్ అనే ఒక ఆకతాయి కుర్రాడు ఉంటాడు. వాడు మామూలోడు కాదు, పెద్ద తోపు ఫ్యామిలీ నుంచి వచ్చినోడు. అతను ఈ కొత్త టీచర్‌ని ఆటపట్టించాలని, ఇబ్బంది పెట్టాలని రకరకాల వేషాలు వేస్తాడు. కానీ ఆ టీచర్ మాత్రం తగ్గకుండా వాడికి గట్టిగానే ఇస్తుంది. ఈ క్రమంలోనే వాడికి ఆ టీచర్ మీద ఎక్కడలేని ఇష్టం పెరిగిపోయి, నేరుగా లవ్ ప్రపోజల్స్ చేయడం మొదలుపెడతాడు.

ఒక పక్క స్కూల్ రూల్స్, ఇంకో పక్క సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఉన్నా.. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ సీరియస్ అయిపోతుంది. వాడు టీచర్‌ని వదలడు, ఆమె కూడా వాడి తెలివితేటలు చూసి ఇష్టపడుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ కుర్రాడి తల్లి చాలా పవర్‌ఫుల్ లేడీ. తన కొడుకు ఒక టీచర్‌తో తిరగడం ఆమెకు అస్సలు నచ్చదు. ఎలాగైనా ఆ టీచర్‌ని స్కూల్ నుంచి పంపించేయాలని రకరకాల ప్లాన్లు వేస్తుంది.

Advertisement

అయితే ఈ లవ్ స్టోరీ వెనుక ఒక పాత పగ కూడా ఉంటుంది. ఆ టీచర్ కేవలం పాఠాలు చెప్పడానికే రాలేదు, గతంలో ఆ కుర్రాడి ఫ్యామిలీ వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవడానికి వస్తుంది. క్లైమాక్స్‌లో అసలు ఆ టీచర్ ఎవరు? ఆ కుర్రాడి తల్లికి, ఈ టీచర్‌కి ఉన్న పాత సంబంధం ఏంటి? వీళ్ళ ప్రేమ గెలిచిందా లేక పగలో కలిసిపోయిందా ? అనే విషయాలను , ఈ సిరీస్ చూసి తెలుసుకోండి.

Read Also : పెళ్లి చేసుకునే గే జంట… అమ్మాయి ఎంట్రీతో మ్యాటర్ మరింత… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లు

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×