E-Paper
Advertisement

Hussain Talat Injury: గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన పాక్ ప్లేయ‌ర్ హుస్సేన్..రంగంలోకి అంబులెన్స్‌

Hussain Talat Injury: గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన పాక్ ప్లేయ‌ర్ హుస్సేన్..రంగంలోకి అంబులెన్స్‌
Advertisement

Hussain Talat Injury:  పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ రెండిటిలో చెరో విజయాన్ని నమోదు చేసుకొని రెండు జట్లు ఉత్సాహంతో ఉన్నాయి. అయితే పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ( Bangladesh vs Pakistan, 2nd ODI) జరిగిన రెండవ వన్డే సందర్భంగా ఊహించని సంఘటన జరిగింది. పాకిస్తాన్ ఆల్రౌండర్ హుస్సేన్ తలాత్ ( Hussain Talat ) ఈ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. బౌండరీ గేట్ బలంగా తగలడంతో అతని భుజానికి ఇంజురీ అయింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

పాకిస్తాన్ ఆల్ రౌండర్ కు తీవ్ర గాయం

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య శుక్రవారం రోజున ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka) వేదిక‌గా రెండవ వన్డే జరిగింది. మొదటి వన్డేలో పాకిస్తాన్ పైన బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో వన్డేలో మాత్రం పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్ పైన 128 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో వేలవ ప్రదర్శన కనబరిచిన హుస్సేన్ తలాత్ కు ( Hussain Talat ) తీవ్రస్థాయిలో గాయమైంది. బంతిని ఆపబోయి, బౌండరీ గేట్ కు గట్టిగా తగిలాడు. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ త‌లాత్ ( Hussain Talat Injury) భుజానికి తీవ్రమైన గాయమైంది. దీంతో అక్కడే కుప్పకూలాడు హుస్సేన్ తలాత్. ఆ తర్వాత అతడు లేచి నిలబడలేకపోయాడు. దీంతో స్ట్రక్చర్ పై అతన్ని బయటకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆల్రౌండర్ హుస్సేన్ తలాత్ పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. అతని ఎడమ భుజానికి సంబంధించిన ఎముక విరిగిందని అంటున్నారు.

రెండో వన్డేలో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే ఢాకా లోని షేర్ బంగ్లా వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై ప్రతి కాలం తీర్చుకుంది పాకిస్తాన్. ఈ క్రమంలో 128 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్,   50 ఓవర్లు ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే 47.3 ఓవర్లు ఆడింది పాకిస్థాన్. ఈ సందర్భంగా 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. 114 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్. దీంతో పాకిస్తాన్ విక్టరీ కొట్టింది.

Advertisement

Also Read:  Salman Ali Agha Run Out: ఒళ్లు మ‌రిచిపోయి నిద్ర‌పోయిన స‌ల్మాన్ అలీ….బ‌చ్చాగాడిని చేసి రనౌట్ చేసిన బంగ్లాదేశ్‌

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×