E-Paper
Advertisement

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?
Advertisement

Trisha Political:ఏ ముహూర్తాన విజయ్ సీఎం అయ్యాడో కాని అప్పటి నుండి అతడి స్నేహితురాలు త్రిష సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.ఇక త్రిష రాజకీయాల్లోకి వచ్చేస్తుందా అంటూ ఆ మధ్య ఒక చర్చ నెట్టింట్లో జోరుగా నడిచింది కూడా.అయితే ఆ తర్వాత క్రమంగా ఆ చర్చ మరుగున పడిపోయింది.ఇక అంతా సమసిపోయింది అనుకున్న సమయంలో ఇపుడు మరోసారి ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కారణం ఈ మధ్యే తమిళనాడులోని కోయంబత్సూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అని చెప్పాలి.

విషయంలోకి వస్తే కోయంబత్సూరులో ఒక కొత్త మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి త్రిష చీఫ్ గెస్ట్ గా హాజరు అయింది. ఇక ఆమె వస్తున్నారనే విషయం తెలిసి, ఆమెను చూడాలని వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చారు. అక్కడ ఉన్న జనాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు కూడా. దీంతో త్రిష కూడా తన కారులోంచి బయటకు వచ్చి, చిరునవ్వుతో వాళ్లకి చేతులు ఊపుతూ ముందుకు వెళ్ళింది .ఒక రకంగా చెప్పాలంటే ఆ సీన్ చూస్తే ఎదో పెద్ద పొలిటికల్ లీడర్ వచ్చాడా అన్నట్టుగా మారిపోయింది.

Advertisement

ఇక ఇది చూసిన నెటిజన్లు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, “త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేస్తుందా అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.అయితే నిజానికి త్రిష రాజకీయాల్లోకి వస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు. ఆమె కానీ, తన వాళ్ళు కానీ ఈ విషయంపై ఎక్కడా నోరు విప్పింది లేదు. కేవలం ఒక షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన అభిమానులని చూసి అప్పుడే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుందా అని ముందే ఒక అంచనాకి రావడం సరికాదనే చెప్పాలి.

సౌత్ ఇండస్ట్రీలో త్రిషకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ ,కోలీవుడ్ లలో ఆమెకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. తెలుగులో ‘వర్షం’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ తమిళ పొన్ను ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.ఇక ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా త్రిష గ్లామర్ గానీ, ఆమెకున్న క్రేజ్ కాని ఎక్కడా తగ్గకపోవడం ఆమె స్పెషాలిటీ అని చెప్పాలి. అందుకే ఎక్కడికి వెళ్ళినా జనాలు నీరాజనాలు పడుతుంటారు.

Advertisement

తమిళనాడులో సినీ ఇండస్ట్రీకి,పాలిటిక్స్ కి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి.తమిళ ఆడియన్స్ తమ అభిమాన నటీనటులను కేవలం వెండితెరపైనే కాకుండా నాయకులుగా చూడటానికి కూడా ఇష్టపడతారు. గతంలో ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ వంటి స్టార్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో మిరాకిల్స్ చేశారు కూడా.ఇక దళపతి స్టార్ హీరో విజయ్ కూడా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఏకంగా సీయం అయ్యాడు.దీంతో ఇపుడు ఏ స్టార్ బయట కనిపించినా ఎదో ఒక పొలిటికల్ డిబేట్ మొదలైపోతుంది.. త్రిష విషయంలో కూడా ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.

మరోవైపు చూస్తే, త్రిష ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో బిజీగా గడిపేస్తుంది’పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కుందవై పాత్రతో అలరించిన ఈ భామ చిరు సరసన ‘విశ్వంభర’ వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది కూడా.అలాంటిది కెరీర్ ని ఇంకా బిజీగానే గడిపేస్తున్న ఈ సమయంలో ఈ బ్యూటీ పాలిటిక్స్ లోకి అడుగుపెడుతుందా అంటే అనుమానమే !

ALSO READ :బండారి పూజిత క్రేజ్ మామూలుగా లేదుగా.. నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా?

https://twitter.com/Suzenbabu/status/2113990392022737130/video/1

Tags

Related News

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?

ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

కృష్ణ మరణం మహేష్, నరేష్ మధ్య విభేదాలు.. నటుడు క్లారిటీ!

రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

Big Stories

Advertisement
×