E-Paper
Advertisement

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష!

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష!
Advertisement

Vijay Thalapathy:గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏకైక పేరు విజయ్ దళపతి.. ఇన్ని రోజులు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్.. టీవీకే అనే పార్టీని స్థాపించి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాడు. ముఖ్యంగా 234 సీట్లకు గాను ఏకంగా 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ పార్టీ నిలిచింది .
ఇకపోతే మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలి అంటే మరో 10 సీట్లు రావాల్సి ఉంటుంది. దాంతో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో పలు ఇబ్బందులు ఎదురైనా.. కొన్ని పార్టీల సహాయంతో ఎట్టకేలకు ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు.

ఘనంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం..

రాజకీయ అరంగేట్రం చేసి తొలి అడుగులోనే ఘనవిజయం సాధించి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి.. తమిళనాడు సంచలనం సృష్టించారు విజయ్ . ఇకపోతే పలు అవాంతరాల తర్వాత నేడు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ, ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు విజయ్. ఇకపోతే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆయనకు మద్దతుగా నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది త్రిష కృష్ణన్ . ఇదే సమయంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ ఆమె ఎక్కడ తగ్గలేదు. తన స్నేహితుడిని వెనకుండి ముందుకు నడిపిస్తూ ఆయన విజయంలో భాగమైంది. మే 4వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వెళ్లిన ఈమె.. ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయ్ అగ్రస్థానంలో నిలిచారు అని తెలిసిన వెంటనే నేరుగా ఆమె తిరుపతి నుండి విజయ్ ఇంటికి చేరుకొని ఆయనకు అభినందనలు తెలిపింది.

విజయ్ ప్రమాణస్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష..

Advertisement

ఇక ఈ విషయం పక్కన పెడితే.. నేడు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన త్రిష.. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా ఆమె స్టేడియానికి చేరుకోగానే అభిమానులు కేరింతలతో ఆమెకు స్వాగతం పలికారు. ముఖ్యంగా విజయ్ సాధించిన ఈ చారిత్రక విజయాన్ని అభినందిస్తూ.. త్రిష రాకకై వేచి చూసిన అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇకపోతే త్రిష రాకతో ఈ స్టేడియం మరింత అందంగా, గ్లామరస్ గా మారిపోయింది. నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయింది. బంగారు రంగు డిజైన్ ఉన్న ఈ చీర.. దానికి జతగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి మరింత హుందాగా కనిపించింది. డైమండ్స్ పొదిగిన సింపుల్ చౌకర్ ధరించి.. జుట్టును ముడివేసి మల్లె పువ్వులతో అలంకరించిన ఈ ప్రత్యేక అలంకరణ ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే త్రిషకు సంబంధించిన ఈ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:ముఖ్యమంత్రిగా విజయ్.. తొలి సంతకం దానిపైనే!

మద్దతు పలికిన సెలబ్రిటీలు..

Advertisement

ఇకపోతే ఈ వేడుకలో త్రిష మాత్రమే కాదు కోలీవుడ్ కి చెందిన పలువురు అగ్ర నటులు ,దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. స్టేడియం లోపల అలాగే వెలుపల వేలాది మంది అభిమానులు దళపతి అంటూ చేస్తున్న నినాదాలతో నెహ్రు స్టేడియం హోరెత్తిపోతోంది. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికలలో 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్.. కాంగ్రెస్ మరియు ఇతర మిత్ర పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సుమారుగా 60 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలైన డిఎంకె, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యాన్ని కిందకు లాగి.. తన పార్టీని ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించేలా చేశారు విజయ్ దళపతి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×