E-Paper
Advertisement

ఫౌజీ మూవీపై ట్రోల్స్.. నందమూరి హీరో మూవీతో పోలుస్తూ!

ఫౌజీ మూవీపై ట్రోల్స్.. నందమూరి హీరో మూవీతో పోలుస్తూ!
Advertisement

Fauzi Movie:రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ఫౌజీ (Fauzi). వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ గ్లింప్స్ సినిమాపై ఊహించని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించిన నటుడు సుభోద్ భావే (Subodh Bhave) కూడా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఫౌజీ సినిమాలో ప్రభాస్ ను ఒక సైనికుడిగా, గూఢచారిగా, వ్యూహకర్తగా పరిచయం చేస్తూ చేసిన తీరు ఆకట్టుకుంది . భగవద్గీత ఆధారంగా రూపొందించిన ఒక రహస్య కోడ్ అంశం కూడా ఇందులో ప్రస్తావనకు రావడంతో కథపై రకరకాల ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

నందమూరి హీరో మూవీతో పోలుస్తూ ట్రోల్స్..

ఇకపోతే ఇదే సమయంలో కొంతమంది కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. 2023లో బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందిన డెవిల్ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చింది. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ గూడచారి పాత్రలో కనిపించారు. త్రివర్ణ అలియాస్ డెవిల్ గా ఆయన చేసిన పాత్రకు రహస్య కార్యకలాపాలు, గూఢచర్యం, దేశభక్తి వంటి అంశాలు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యానికి సంబంధించిన అంశాలు కూడా ఈ కథలో భాగమయ్యాయి. అయితే ఇప్పుడు ఫౌజీలో కూడా నేతాజీ ప్రస్తావన రావడం, గూఢచర్యానికి సంబంధించిన అంశాలు కనిపించడంతో కొంతమంది ఈ రెండు సినిమాలను పోల్చుతూ డెవిల్ సినిమాలాగే ఫౌజీ కూడా ఉంటుందేమో అంటూ అనుమానంతో పాటు ట్రోల్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు.

పోలికలు ఉన్నంత మాత్రాన కథ ఒక్కటేనా?

Advertisement

అయితే ఇక్కడ మరో అంశం ఏమిటంటే.. పోలికలు ఉన్నంత మాత్రాన కథ ఒకటేనా అనే చర్చ కూడా మొదలయ్యింది. ఫౌజీ, డెవిల్ చిత్రాలలో గూడచర్యం, దేశభక్తి, చారిత్రక నేపథ్యం వంటి అంశాలు ఉన్నప్పటికీ.. ఈ అంశాలు కనిపించినంత మాత్రాన రెండు సినిమాల కథలు ఒకటేనని చెప్పలేం. వాటి కథనం, పాత్రల రూపకల్పన, సంఘర్షణ, దర్శకులు ఎంచుకున్న కథా పద్ధతులు కూడా వేరువేరు ఉండే అవకాశం ఉంది. అందుకే పోలికలు ఉన్నంత మాత్రాన కథ ఒకటే అని చెప్పలేం. పూర్తి కథ తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఎదురు చూడాల్సిందే.

also read: రోహిత్ కి ఊహించని షాక్.. హౌస్ లో ఉన్నంతకాలం అలాగే ఉండాల్సిందేనా?

ఫౌజీ సినిమా తారాగణం..

Advertisement

ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. 2027 మార్చి 19వ తేదీన తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతోంది. ఇక ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్గా సుభోద్ భావే అనే మరాఠి నటుడు నటిస్తున్నారు.

Related News

ధనుష్ పొలిటికల్ మీటింగ్.. 3000 మంది మహిళా ప్రతినిధులతో!

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

Advertisement
×