E-Paper
Advertisement

రోహిత్ కి ఊహించని షాక్.. హౌస్ లో ఉన్నంతకాలం అలాగే ఉండాల్సిందేనా?

రోహిత్ కి ఊహించని షాక్.. హౌస్ లో ఉన్నంతకాలం అలాగే ఉండాల్సిందేనా?
Advertisement

Bigg Boss 10 Rohit Naidu:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆడియన్స్ కు ఎలాంటి వినోదాన్ని పంచుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఎన్నడూ లేని విధంగా అసభ్యకర ప్రవర్తన, మాట తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రోజుకో టాస్క్ ఆడియన్స్ లో ఆసక్తిని కనబరుస్తున్నా.. కంటెస్టెంట్ల తీరు చూస్తే ఆడియన్స్ కు విసుగు పుడుతోంది. ముఖ్యంగా మనం ఒక రియాలిటీ షోలో పాటిస్పేట్ చేస్తున్నాము.. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు.. అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్న తీరుకి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీకెండ్స్ వచ్చాయి అంటే చాలు హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఏడవ వారం వీకెండ్స్ లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి వినోదం సంగతి కాస్త పక్కన పెడితే.. కంటెస్టెంట్స్ ప్రవర్తన పై ఏకంగా బ్లాక్ మార్క్ వేయడం సంచలనంగా మారింది.

రోహిత్ కి బ్లాక్ బ్యాడ్జ్..

షాలిని కి మరో అవకాశం ఇచ్చినా సరే తన ప్రవర్తన మారకపోవడంతో ఆమెకు క్లాస్ పీకిన నాగార్జున.. ఆ తర్వాత త్రిగుణ్ ప్రవర్తన పై విమర్శలు గుప్పించారు. హౌస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ మండిపడ్డారు. ఇక రోహిత్ కి ఏకంగా బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అతడికి ఊహించని షాక్ ఇవ్వడం వైరల్ గా మారింది. నిన్నటి ఎపిసోడ్లో రోహిత్ పై మండిపడ్డ నాగార్జున ప్రవర్తన లేదు, పరివర్తన రాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఒక ఎల్లో కార్డు ఇచ్చాము.. మరో ఎల్లో కార్డు ఇస్తే డైరెక్ట్ గెట్స్ ఓపెన్ చేయడమే అంటూ హెచ్చరించిన నాగార్జున.. ఏకంగా బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు.

కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయిన రోహిత్..

Advertisement

ఇకపోతే నాగార్జున రోహిత్ కి మరో షాక్ ఇవ్వడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా రోహిత్ తో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ..” బాడీ షేమింగ్ చేస్తున్నావు.. అసభ్యకర మాటలు మాట్లాడుతున్నావు.. మాటల్లో అగ్రేసివ్ నెస్ కనిపిస్తోంది. బిహేవియర్ లేదు.. ప్రవర్తన లేదు.. పరివర్తన రాదు.. నీకు ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు వచ్చింది. సహజంగా ఇంకో ఎల్లో కార్డు వస్తే గేట్ ఓపెన్ చేసి బయటకు పంపాలి. అందుకే నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తున్నాను” అంటూ షాక్ ఇచ్చారు. “నీ క్యారెక్టర్ పైన ఒక బ్లాక్ బ్యాడ్జ్. నువ్వు ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని వారాలు కెప్టెన్ అయ్యే అవకాశం నీకు లేదు” అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

also read: ఇదెక్కడి పోలిక రా నాయనా.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ మహాభారతంలో ఏ పాత్రకు సరిపోతారంటే?

మోకాళ్లపై పడి వేడుకున్న రోహిత్..

Advertisement

ప్లీజ్ సార్ దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇప్పటివరకు నేను ప్రామిస్ చేయలేదు అంటూ మోకాళ్ళపై రోహిత్ పడి వేడుకున్నప్పటికీ నాగార్జున తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అసలు ఎన్నిసార్లు క్షమాపణలు కోరుతావ్ అంటూ రోహిత్ ప్రవర్తనపై ఫైర్ అయ్యాడు. తను హౌస్ లో ఉన్నంతకాలం కెప్టెన్సీ కంటెండర్ కాదు అంటూ చెప్పేశాడు నాగార్జున. మొత్తానికైతే దశావతారంలో భాగంగా జరుగుతున్న ఈ ట్విస్ట్ లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరే హంతకురాలు అన్న విషయం వైజయంతికి తెలిసిపోతుందా..?    

ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!

ఇంత అహంకారమా?  నాగార్జున ఫైర్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని?

రేయ్ త్రిగుణ్ లేగురా…మరీ ఇంత లేకిగానా.. ఇచ్చి పడేసిన నాగార్జున!

ఇదెక్కడి పోలిక రా నాయనా.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ మహాభారతంలో ఏ పాత్రకు సరిపోతారంటే?

ట్రెయిటర్స్‌లో ఆట పక్కన పెట్టి పర్సనల్ అటాక్‌లు.. ఇదేం గొడవరా బాబూ!

సుమ 116 ఏళ్ళు బ్రతకాలి..రాజీవ్ మాటలకు సుమ ఎమోషనల్!

Big Stories

Advertisement
×