BigTV English

HHVM VFX : వీరమల్లు కార్టూన్ వీరుడు… ఎంత మోసం చేశావ్ జ్యోతికృష్ణ

HHVM VFX : వీరమల్లు కార్టూన్ వీరుడు… ఎంత మోసం చేశావ్ జ్యోతికృష్ణ

HHVM VFX : పవన్ కళ్యాణ్ ప్రయాణం అందరికీ తెలుసు. సినిమాలలో తనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కెరియర్ స్టార్టింగ్ లోనే నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వరుసగా అందుకొని ఆంధ్ర యూత్ ను తన వైపు తిప్పుకున్నాడు. ప్రతి సినిమాకి కొత్త టెక్నాలజీ, కొత్తదనం, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్, సమాజానికి పనికి వచ్చే పాటలు ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే చూసేవాళ్ళం.


అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అయిపోవడం వలన సినిమాలు మీద తన దృష్టిని తగ్గించేశారు. సినిమా మీద ఎంతో కేర్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈరోజు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా ఈరోజు విడుదలైన హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.

వీరమల్లు కార్టూన్ వీరుడు 


తెలుగు సినిమా ఏ స్థాయిలో డెవలప్ అయిందో అందరికీ తెలుసు. తెలుగు నుండి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇటువంటి తరుణంలో నాసిరకమైన విఎఫ్ఎక్స్ వర్క్ తో తెలుగు సినిమా స్థాయిని తగ్గిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా సెకండాఫ్ విషయంలో చాలామందికి అసంతృప్తి ఉంది. దాదాపు ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్టు నడిచినా కూడా హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ మీద ఎందుకు కేర్ తీసుకోలేదు. కొన్నిచోట్ల వి ఎఫ్ ఎక్స్ చూస్తుంటే సోషల్ మీడియాలో వినిపించినట్లు అమీర్ పేట్ ఎడిటింగ్ కంటే దారుణంగా ఉన్నాయి. జ్యోతి కృష్ణ ఈ సినిమా విషయంలో చాలా కష్టపడ్డారు దానిలో సందేహం లేదు. మరి స్క్రీన్ పైన సినిమాను చూసుకుంటున్నప్పుడు వాళ్లకి కూడా అర్థం కాలేదా.? లేదంటే ప్రేక్షకులకు ఇది చాలు అని కాంప్రమైజ్ అయిపోయారా అనేది అర్థం కాని విషయం.

ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఎలా.?

ఈ సినిమాలో కొన్ని విఎఫ్ఎక్స్ పరంగా వీక్ గా ఉన్న సీన్స్ ను రిమూవ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదేళ్ల టైం లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పటివరకు ఏం చేశారు అనేది కొంతమంది వాదన. ఫస్ట్ ఆఫ్ ఒకరకంగా పరవాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ ఏ మాత్రం బాగున్న సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అని పవన్ కళ్యాణ్ అభిమానుల మైండ్ లో ఉంది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత లెక్కలన్నీ ఫార్మర్ అయిపోయాయి. మొత్తానికి ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు, అభిమానులకు సంతృప్తి కలిగించిందా అంటే లేదు అనేది ఎక్కువ శాతం సమాధానం.

Also Read: Hari Hara Veeramallu: గుడ్ న్యూస్… వీరమల్లు అప్డేట్ వెర్షన్ రాబోతుంది.. ఏం మారుస్తున్నారంటే ?

Related News

Director Bobby: ‘మన శంకర వరప్రసాద్‌ గారూ’ మూవీపై డైరెక్టర్‌ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Big Stories

×