BigTV English

Neha Chowdary: విడాకుల బాటలో నేహా చౌదరి.. భర్తకు దూరంగా…ఫోటోలు డిలీట్?

Neha Chowdary: విడాకుల బాటలో నేహా చౌదరి.. భర్తకు దూరంగా…ఫోటోలు డిలీట్?

Neha Chowdary: నేహా చౌదరి(Neha Chowdary) పరిచయం అవసరం లేని పేరు. మన తెలుగు అమ్మాయి అయినా నేహా చౌదరి మహా టీవీలో యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. జిమ్, యోగ ట్రైనర్ గా, స్పోర్ట్స్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నేహా చౌదరి ఉన్నఫలంగా బిగ్ బాస్6 (Bigg Boss 6)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని వారాల తర్వాత ఎలిమినేట్ అయినప్పటికీ ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ కాగానే నేహా చౌదరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.


బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా…

బిగ్ బాస్ కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే ఈమె పెళ్లి కూడా ఫిక్స్ అయింది బిగ్ బాస్ ఫినాలకి నేహా చౌదరి పెళ్లికూతురు గెటప్ లోనే వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ మరుసటి రోజు ఈమె వివాహ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. నేహా చౌదరి తన చిన్నప్పటి స్నేహితుడు అనిల్(Anil) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోవడంతో తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పలు సందర్భాలలో నేహా చౌదరి తెలియచేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె బీబీ జోడీ కార్యక్రమంలో పాల్గొంటూ తన డాన్స్ తో అందరిని మెస్మరైస్ చేశారు.


స్నేహితుడిని పెళ్లాడిన నేహా చౌదరి…

ఇక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన నేహా చౌదరి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు అయితే గత కొంతకాలంగా నేహా చౌదరి సోషల్ మీడియాని కనుక గమనిస్తే ఈమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు ఎక్కడ కనిపించలేదు అలాగే ఇదివరకు షేర్ చేసిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. అదేవిధంగా గత కొంతకాలంగా నేహా చౌదరి తన భర్తకు దూరంగా ఇండియాలోనే ఉంటున్నారు. తన భర్త అనిల్ విదేశాలలో ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఇండియాలోనే ఉంటున్న నేపథ్యంలో వీరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు వచ్చాయని అందుకే దూరంగా ఉంటున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.

విడాకులు తీసుకుందా?

ఇకపోతే సెలబ్రిటీలు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా విడిపోవడానికి ముందు సోషల్ మీడియా ఫోటోలను డిలీట్ చేయడం, సింగిల్ గా ఉండడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేహా చౌదరి కూడా తన భర్తకు దూరంగా ఉండటమే కాకుండా తన భర్త ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ జంట కూడా విడాకులు (Divorce) తీసుకోబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు నేహా చౌదరి ఈ విషయాల గురించి ఎక్కడ స్పందించలేదు కానీ ఈమె అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే నేహా చౌదరి తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయిందా? ఫోటోలను డిలీట్ చేయడం వెనుక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాలి అంటే నేహా స్పందించాల్సి ఉంటుంది.

Also Read: Allu Arha: రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్హ… పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్?

Related News

Bigg Boss Telugu 9: రెండోవారం హౌజ్‌ కెప్టెన్‌ అతడే.. కామనర్స్ నుంచి తొలి కంటెస్టెంట్ గా..

Bigg Boss 9: 2వ వారం ఓటింగ్ లిస్ట్ వైరల్.. టాప్ లో సుమన్ శెట్టి.. లీస్ట్ ఎవరంటే?

Bigg Boss 9 Promo : రంగుపడుద్ది టాస్క్, మొత్తానికి కామనర్స్, ఓనర్స్ అనే రంగులు బయటపడ్డాయి 

Bigg Boss 9: కెప్టెన్సీ వార్… ఆ లవ్లీ జంట మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం మళ్లీ యుద్ధం.. ఈవారం గెలిచేదెవరు?

Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ

Bigg Boss 9 Promo : కామనర్స్ మరీ ఇంత కరువులో ఉన్నారా… హౌస్‌లో అందరూ చూస్తుండగానే

Bigg Boss 9: ముద్దుల వర్షం కురిపించిన ఇమ్ము.. తనూజా ఏం చేసిందంటే?

Big Stories

×