Hari Hara Veeramallu: దాదాపు 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ కెరియర్ లో వినిపిస్తున్న సినిమా పేరు హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమాను అని చేస్తున్నారు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, అందరికీ ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. కాలక్రమేనా ఆ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో నిరుత్సాహం మిగిలింది.
క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను టేకప్ చేశారు. అయితే ఈ సినిమా గురించి పలు సందర్భాలలో నిర్మాత ఏం రత్నం మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటుంది.
అప్డేట్ వెర్షన్
ఈ సినిమాకు సంబంధించి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్ షోస్ దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ బాగుంది అని చాలామంది మాట్లాడారు. సెకండ్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి ఊహించని మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన వి ఎఫ్ ఎక్స్ సీన్స్ గురించి బీభత్సమైన టాపిక్ నడిచింది. అయితే సెకండ్ హాఫ్ లో వీక్ గా ఉన్న విఎఫ్ఎక్స్ సీన్స్ తొలగించి అప్డేట్ వెర్షన్ యాడ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఒకరకంగా సినిమా చూడని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది శుభవార్త. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటివరకు సినిమా చూడకుండా ఉంటారా అంటే అది కూడా సందేహమే. ఏ విషయంలో అభిమానులు నిరుత్సాహపడ్డారు ఆ విషయాన్ని ఇప్పుడు సరి చేస్తున్నారు. అప్డేట్ వెర్షన్ యాడ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
సెకండాఫ్ పైన మార్పులు
సినిమా ఫస్ట్ అఫ్ విషయంలో పెద్దగా కంప్లైంట్ లేవు. సెకండ్ హాఫ్ లో వీక్ గా ఉన్న సిజి సీన్స్ ను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకరకంగా ఈ సినిమాతో నిరుత్సాహ పడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది. అనేది ఇంకొంతమంది జనాలు చూసిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు అయితే వచ్చేసింది.
Also Read: Harihara Veeramallu: ఘనంగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్.. ఎక్కడ? ఎప్పుడంటే?