Trump Reacts on Sydney Sweeney Jeans Ad: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రముఖ నటి సిడ్నీ స్వీనీకి మద్దతుగా నిలిచారు. తాజాగా ఇంటర్య్వూలో ఆయన సిడ్నీ స్వీనీ జీన్స్ యాడ్ చాలా అద్బుతంగా ఉందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలపై అగ్రరాజ్యంలో పెద్ద ఎత్తున్న చర్చలు జరుగుతున్నాయి. ఆయన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఇటీవల సిడ్నీ స్వీనీ అమెరికన్ ప్రముఖ బ్రాండ్ ఈగిల్ బ్రాండ్ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ జాతీ వివక్షకు దారితీశాయంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. ఈ ప్రకటనలో ఆమె నటిస్తూ ఇలా అంది.
వివాదంలో సిడ్నీ యాడ్
‘మై జీన్స్ కలర్ ఈజ్ బ్లూ‘(నా జీన్స్ నీలం రంగులో ఉన్నాయి) అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె జీన్స్ అని ప్రస్తావించిన ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. జీన్స్ అంటే జన్యుపరమైన అంశంగా భావిస్తూ కొందరు ఆమెపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రకటన ముఖ్యంగా నల్లజాతీయులను అవహేళన చేసేలా ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి. పాశ్చాత్య సౌందర్య ప్రమాణాలు, శ్వేతజాతీయుల ఆధిపత్య భావజాలాన్ని ప్రోత్సహిస్తోన్నాయని సిడ్నీ స్వీనీపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. అంతేకాదు ఈ బ్రాండ్ తాము బ్యాన్ చేస్తున్నామని, వాటిని తాము ధరింబోమంటూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో వివాదస్పదంగా మారిన తరుణంలో ట్రంప్ సిడ్నీ స్వీనీకి మద్దతుగా కామెంట్స్ చేయడం మరింత చర్చనీయాంశం అయ్యింది.
సిడ్నీ రిపబ్లికనా?
దీనికి కారణం ఆమె రిపబ్లికన్లో సభ్యత్యం కలిగి ఉండటమే. ఈ విషయాన్ని కూడా ట్రంప్ బహిరంగం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రంప్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అభిప్రాయాలు, ధోరణి చాలా భిన్నంగా ఉంటాయి. చాలా మంది వ్యతిరేకిస్తున్న అంశాలకు ఆయన మద్దతు ఇస్తుంటారు. అమెరికాలో ఆయన ఒక రెబల్ నాయకుడి అని చెప్పాలి. సిడ్నీ స్వీనీ యాడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో ట్రంప్ ఆమె ప్రకటన చాలా అద్భుతం అని వ్యాఖ్యానించడం అందరిని షాకిస్తుంది. ముఖ్యంగా ఆమెను వ్యతిరేకిస్తున్న వారిని ఇది షాకింగ్ ప్రకటన అంటున్నారు. తాజాగా ట్రంప్ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సిడ్నీ స్వీనీ నటి సిడ్నీ స్వీనీ.. రిప్లబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకోవడంపై విలేకరి ఆయనను ప్రశ్నించారు. దీనిపై ఆయన అభిప్రాయాన్ని కోరగా ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆమె యాడ్ అద్భుతం..
‘అది తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎంత మంది రిపబ్లికన్లు ఉన్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయంపై నేను చాలా సంతోషంగా ఉన్న. ఒకవేళ మీరు చెప్పినట్టుగా సిడ్నీ స్వీనీ రిప్లబ్లికలో రిజిస్టర్డ్ అయితే మాత్రం ఇది చాలా సంతోషించే విషయం. ఇక ఆమె ప్రకటన అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యాలపై అమెరికన్ ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ట్రంప్ మద్దతుతో ఆమెపై వస్తున్న వ్యతిరేకత కాస్తా తగ్గిందని అనిపిస్తోంది. ఈ కామెంట్స్ తర్వాత చాలామంది సిడ్నీ స్వీనీకి మద్దతు తెలుపుతుండటం విశేషం. మరోవైపు సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ నెటిజన్స్ నుంచి రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ‘హో… ట్రంప్ మామ కూడా సిడ్నీ స్వీనీకి పడిపోయినట్టున్నాడు, ఏంటీ ట్రంప్ మామ సిడ్నీపై మనసు పారేకున్నావా?’ అంటూ సరదగా కామెంట్స్ చేస్తున్నారు.
REPORTER: "Actress Sydney Sweeney — it came out this weekend that she's a registered Republican."@POTUS: "You'd be surprised at how many people are Republicans … I'm glad you told me that. If Sydney Sweeney is a registered Republican, I think her ad is fantastic!" 😂🤣 pic.twitter.com/baLwJHBbuD
— Rapid Response 47 (@RapidResponse47) August 4, 2025