OTT Movies: మంచి ఫ్యామిలీ, కామెడీ మూవీ చూసి చానాళ్లు అయ్యిందని ఫీలవుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే. కామెడీ, భావోద్వేగాలు.. కుటుంబ విలువలు గురించి చెప్పే ఒక మంచి మూవీ ఇది. ఈ తమిళ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. శివ, మలయాళ నటి గ్రేస్ ఆంటోనీ, మాస్టర్ మితుల్ ర్యాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. మరి ఈ కథేంటో చూద్దాం!
అల్లరి కొడుకు.. సీరియస్ నాన్న
హైదరాబాద్‌లో సాధారణం జీవితం గడుపుతున్న ఓ కుటుంబం ఇది. గోకుల్ (శివ), గ్లోరీ (గ్రేస్ ఆంటోనీ) భార్య భర్తలు. వీరికి 8 ఏళ్ల కొడుకు అన్బు (మితుల్ ర్యాన్) కొడుకు ఉంటాడు. గోకుల్ (శివ) చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిడితో సతమతమవుతూ ఉంటాడు. గోకుల్ కొడుకు అన్బు చాలా చురుకైనవాడు. చాలా అల్లరి కూడా. అతడు చేసే పనులు గోకుల్, గ్లోరీకి తలనొప్పిగా మారతాయి. ఒక రోజు అన్బు స్కూల్ బస్సు టైర్‌ను పంక్చర్ చేస్తాడు. దీంతో గోకుల్ తీవ్ర ఆగ్రహానికి గురవ్వుతాడు. అన్బును తీసుకెళ్లి.. తన స్వగ్రామంలోని తాతయ్య వద్ద వదిలేయాలని ప్లాన్ చేస్తాడు. అక్కడ ఉంటే అన్బూ కొంచెమైన క్రమశిక్షణ నేర్చుకుంటాడని అనుకుంటాడు.
కారులో కేరళాకు ప్రయాణం..
గోకుల్ తాత కేరళాలో ఉంటాడు. ఆయన దగ్గకు గోకుల్, గ్లోరి, అన్బూ కారులో బయల్దేరుతారు. ప్రయాణం మొదట్లో గోకుల్ చాలా కోపంతో, అన్బు భయంతో ఉంటాడు. కానీ, ఆ రోడ్ జర్నీ వారిలో చాలా మార్పు తెస్తుంది. పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు చూసి పరవశించిపోతారు. ఆ ప్రయాణంలో వారికి సూరి (అజు వర్గీస్) అనే గిటారు వాద్యకారుడు పరిచయం అవుతాడు. అతను అన్బుకు గిటార్ వాయించడం నేర్పిస్తాడు. అన్బు హ్యాపీగా ఉండటం చూసి గోకుల్‌లో కూడా మార్పు వస్తుంది. అప్పటివరకు కోపంగా ఉన్న గోకుల్.. కొడుకు అల్లరి చూస్తూ మురిసిపోతుంటాడు.
అక్కడ గ్రామంలో జరిగే ఓ ఫెస్టివల్‌కు గోకుల్ ఫ్యామిలీ వెళ్తారు. అక్కడ అన్బు ఎంతో చక్కగా గిటార్ వాయిస్తుండటం చూసి ఆశ్చర్యపోతాడు గోకుల్. తన కొడుకులో ఇంత టాటెంట్ ఉందా అనుకుంటాడు. అన్బూ అమాయకత్వం చూసి గోకుల్ భావోద్వేగానికి గురవ్వుతాడు. ఈ సందర్భంగా గోకుల్ తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. అన్బూకు కూడా తన తండ్రి మనసును అర్థం చేసుకుంటాడు. మరి, ఈ కథలో చివరికి ఏమవుతుంది? గోకుల్ ముందుగా అనుకున్నట్లే అన్బూను తన తాత ఇంట్లో వదిలిపెట్టేస్తాడా? చివరికి ఏమవుతుందనేది బుల్లి తెరపై చూస్తేనే బాగుంటుంది. అన్నట్లు ఈ మూవీలో అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా Jio Hotstar ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఈ ఫీల్ గుడ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.