Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 6వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: రుణ విముక్తి, ప్రయాణసౌఖ్యం, నూతన ప్రదేశాలను దర్శిస్తారు. సంతాన విషయమై ఆందోళన, కుటుంబ సౌఖ్యం. పితృవర్గం వారితో సంప్రదింపులు చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మాటల్లో తొందరపాటు వల్ల నష్టం. సోదరవర్గం నుండి శుభవార్త వింటారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య:1,6
కలిసివచ్చే రంగు:గోధుమ రంగు
పక్షులకు ఆహారం ఇవ్వండి.
వృషభ రాశి: గ్రహబలం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు మొదలుపెడుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. వస్తు లాభం. పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్య విషయమై ఆందోళన. సోదరుల సహకారంతో ముందడుగు వేస్తారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య:7,3
కలిసివచ్చే రంగు: పసుపు రంగు
గణపతి దర్శనం శుభం కలిగిస్తుంది.
మిథునరాశి: గ్రహబలం బాగుంటుంది. మీమాట నిలబెట్టుకుంటారు. మాతృవర్గం వారితో వాదనలు. వస్తు నష్టం. ఆకస్మిక ధనలాభం. దైవ చింతన చేస్తారు. జీవిత భాగస్వామి అన్ని విధాలా తోడుగా ఉంటారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7,2
కలసివచ్చేరంగు: ఎరుపురంగు
సుబ్రహ్మణ్యస్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.
కర్కాటకరాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. వేడుకులకు హాజరవుతారు. మంచి ఆలోచనలు చేస్తారు. ఆత్మీయుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. నూతన రుణాలు పొందుతారు. శతృవులు మిత్రులుగా మారతారు. స్థల విక్రయాలు జరుపుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 5, 2
కలసివచ్చే రంగు ఆకుపచ్చ రంగు
రామాలయంలో తులసి మాల సమర్పించండి
సింహరాశి: ఊహించని ఖర్చులు చేయవలసి వస్తుంది. అవసరాలకు రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణం చేస్తారు. కొందరి పరిచయం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుతాయి. క్రయ, విక్రయాలు జరుపుతారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 2,7
కలిసివచ్చే రంగు: నీలంరంగు
దుర్గాదేవికి ఆవుపాలు సమర్పించండి.
కన్యారాశి: అపరిచితులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీ మూలక ధనలాభం ఉంది. ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. మీమాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారు వైరాగ్య భావనలు కలుగుతాయి. స్థిరాస్తుల పంపకాలు జరుపుతారు. నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోతారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రేమతో పనులు సాగించండి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 2,9
కలసివచ్చేరంగు: తెలుపురంగు
శివాలయంలో ఆవుపాలతో అభిషేకం జరిపించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం జరిగే సూచనలు. పెట్టుబడుల విషయమై ఆలోచిస్తారు. కొందరి వ్యవహారాలలో మధ్యవర్తిత్వం జరుపుతారు. మీవల్ల ఇతరులకు మేలు జరుగుతుంది.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 4, 9
కలసివచ్చేరంగు: బూడిదరంగు
గ్రామదేవతను దర్శించడం వల్ల శుభం కలుగుతుంది
వృశ్చికరాశి: మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ చుట్టూ జరిగే సంఘటనలను గమనిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. ప్రముఖులతో కలిసి సమయం గడుపుతారు. అధికారులను సంప్రదిస్తారు. కొన్ని విషయాలు అసంతృప్తి కలిగిస్తాయి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 4, 2
కలసివచ్చేరంగు: ముదురు నీలంరంగు
దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల శుభం కలుగుతుంది.
ధనస్సురాశి: పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అధికారులతో మర్యాదగా నడుచుకోండి. స్త్రీమూలక లాభం. బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 3,8
కలసివచ్చేరంగు: నలుపురంగు
కాలభైరవస్వామిని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.
మకరరాశి: ప్రభుత్వ కార్యాలయాలను సందర్శిస్తారు. ఆర్థికంగా సద్వయం చేస్తారు. మీ మాటలతో ఎదుటి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. కళత్రవర్గం వారితో ఆనందంగా గడుపుతారు. స్వల్పంగా అస్వస్థతకు గురవుతారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 9,6
కలసివచ్చేరంగు: కాషాయం రంగు
లక్ష్మీనరసింహస్వామిని ధ్యానించడంవల్ల శుభంకలుగుతుంది.
కుంభరాశి: అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన విషయమై ఖర్చులు చేయాల్సి వస్తుంది. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడికి గురవుతారు. శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 8,4
కలసివచ్చేరంగు: లేత నీలంరంగు
ఇంటినుండి వెళ్ళేముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.
మీనరాశి: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధు, మిత్రుల సహకారాలుంటాయి. బద్ధకంగా ఉంటుంది కానీ పట్టుదలతో ముందుకు సాగండి. దైవబలం తోడవుతుంది. అపరిచితులతో ఆంతరంగిక విషయాలు చర్చించకండి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 3,5
కలసివచ్చే రంగు: కాఫీకలరు
లక్ష్మీనారాయణులను ప్రార్థించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే