E-Paper
Advertisement

స్పిరిట్ బ్యూటీకి అరుదైన గౌరవం.. మొట్టమొదటి ఇండియన్ నటిగా గుర్తింపు!

స్పిరిట్ బ్యూటీకి అరుదైన గౌరవం.. మొట్టమొదటి ఇండియన్ నటిగా గుర్తింపు!
Advertisement

Tripti dimri: రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలయికలో సందీప్ రెడ్డి వంగ సంచలనం సృష్టించిన చిత్రం యానిమల్. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది తృప్తి డిమ్రి. ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాను.. అందులో భాగంగానే మళ్ళీ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ దీపికా పదుకొనేను తప్పించి మరీ స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన తృప్తికి అవకాశం ఇచ్చారు అంటే ప్రస్తుతం ఈమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ కాస్త గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా తృప్తి సరికొత్త సంచలనం సృష్టించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్ ఇండియన్ నటిగా తృప్తి డిమ్రి సరికొత్త రికార్డ్..

గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ “విక్టోరియా సీక్రెట్” కి తొలి భారతీయ అంబాసిడర్ గా తృప్తి డిమ్రి ఎంపికైంది. ఇది ఫ్యాషన్ ప్రపంచంలోనే ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. ఈ నిర్ణయం భారతీయ ప్రతిభకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కి నిదర్శనం అనడంలో సందేహం లేదు. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇండియాకు దక్కిన అరుదైన గౌరవం. దశాబ్దాలుగా ఫారెన్ బ్యూటీలనే తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంటున్న విక్టోరియా సీక్రెట్ ఇప్పుడు తొలిసారి భారతీయ ముఖానికి చోటు ఇవ్వడం అతిపెద్ద మార్పుకు సంకేతం.. అంతేకాదు గ్లోబల్ ఫ్యాషన్ లో ఇండియాకి దక్కుతున్న గౌరవాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఆకట్టుకోవడానికి చాలా బ్రాండ్లు ఇప్పుడు వైవిధ్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియన్ మోడల్ కి విక్టోరియా ఫ్యాషన్ కంపెనీ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తృప్తి డిమ్రి ఇప్పుడు ఊహించని గౌరవాన్ని సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

also read:చమ్మక్ చంద్రతో అలాంటి బంధం.. ఇన్నాళ్లకు నిజం చెప్పిన సత్య శ్రీ!

తృప్తి డిమ్రి కెరియర్..

1994 ఫిబ్రవరి 23న జన్మించిన ఈమె.. తొలిసారి 2015లో ‘పోస్టర్ బాయ్స్’ అనే కామెడీ చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయమైంది. అయితే 2018 లో వచ్చిన రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను సినిమాతో తొలిసారి హీరోయిన్గా అవతరించింది. ఆ తర్వాత అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్, కళ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె 2021 లో 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది . అలాగే 2020లో రెడిఫ్ డాట్ కామ్ బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020 లో 20వ స్థానంలో నిలిచింది.. అలా పలు విభాగాలలో పురస్కారాలు అందుకున్న ఈమెకు.. యానిమల్ చిత్రంతో ఊహించని పాపులారిటీ లభించింది.. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తృప్తి హీరోయిన్గా ఎంపిక అవడం గమనార్హం.

Advertisement

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×