E-Paper
Advertisement

వారణాసి హైవేపై ట్రక్కులు ఢీకొని మంటలు.. డ్రైవర్ సజీవదహనం

వారణాసి హైవేపై ట్రక్కులు ఢీకొని మంటలు.. డ్రైవర్ సజీవదహనం
Advertisement

Truck Accident: ఉత్తరప్రదేశ్‌లోని సోన్భద్ర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వారణాసి-శక్తి నగర్ రహదారిపై హథినాల హత్వాని సమీపంలో రెండు ట్రక్కులు అతివేగంతో ఎదురెదురుగా ఢీకున్నాయి.. ఢీకొన్న మరుక్షణమే ఇంధన ట్యాంకులు పగిలి మంటలు చెలరేగగా, అవి చూస్తుండగానే వాహనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. మరో డ్రైవర్ వాహన కేబిన్‌లోనే చిక్కుకుపోయాడు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు సహాయం అందించడానికి బదులు, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం అత్యంత విచారకరం. ఆ డ్రైవర్ తనను కాపాడమని మంటల మధ్య నుండి కేకలు వేస్తున్నా, చుట్టుపక్కల వారు నిస్సహాయంగా నిలబడి రికార్డింగ్‌లు చేయడమే తప్ప ముందుకు రాలేదు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడాలనే ఆలోచన కంటే, ఆ దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలనే తాపత్రయమే అక్కడ కనిపించింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, సరైన సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మంటలు అదుపులోకి వచ్చేసరికి ఆ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ప్రాణం కంటే వైరల్ వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షతగాత్రుడైన మరో డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:పల్సర్ 180 vs అపాచీ RTR 180.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×