E-Paper
Advertisement

కవాసకి నుంచి డబుల్ ఆఫర్.. ఆ బైక్స్ పై భారీగా డిస్కౌంట్లు!

కవాసకి నుంచి డబుల్ ఆఫర్.. ఆ బైక్స్ పై భారీగా డిస్కౌంట్లు!
Advertisement

Kawasaki Announces Massive Discounts: భారత మార్కెట్లో ప్రీమియం బైక్‌ లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కవాసకీ ఇండియా తన పాపులర్ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా నింజా ZX-10Rపై భారీగా తగ్గింపు అందిస్తోంది. ఏకంగా రూ. 2.89 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ఆఫర్ 2026 ఏప్రిల్ 30 వరకు లేదంటే స్టాక్ ఉన్నంత వరకు అందించనుంది.

రూ. 17.90 లక్షలకు తగ్గిన నింజా ZX-10R ధర

తాజా డిస్కౌంట్ తో నింజా ZX-10R ధర రూ. 20.79 లక్షల నుంచి రూ. 17.90 లక్షలకు తగ్గింది. అయితే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రం పాత ధర ఆధారంగానే కొనసాగుతాయి. అయినప్పటికీ, ఈ తగ్గింపు వల్ల కొనుగోలుదారులు పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఆ డబ్బును రైడింగ్ గేర్, ఇతర యాక్సెసరీల కోసం ఉపయోగించుకోవచ్చు.

నింజా ZX-10R గురించి..

Advertisement

నింజా ZX-10R ఇప్పటికే భారత్ లో అందుబాటులో ఉన్న సరసమైన సూపర్‌ బైక్‌లలో ఒకటి. ఈ డిస్కౌంట్‌ తో మరింత తక్కువ ధరలో అందుబాటలోకి రానుంది. మెకానికల్ గా ఈ బైక్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికీ 998cc ఇన్‌ లైన్ ఫోర్ ఇంజన్‌ తో పని చేస్తుంది. ఈ ఇంజన్ సుమారు 202bhp పవర్, 112Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ లో అడ్వాన్స్‌ డ్ ఫీచర్లు ఉన్నాయి. బై డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఇవి హై-పర్ఫార్మెన్స్ రైడింగ్‌కు మరింత సహాయపడతాయి.

కవాసకీ Z650RS మోడల్‌ పై ప్రత్యేక ఆఫర్

అటు కవాసకీ Z650RS మోడ ల్‌పై కూడా కంపెనీ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఈ బైక్‌పై రూ. 34,000 వరకు తగ్గింపు వోచర్ అందిస్తున్నారు. వోచర్‌ ను ఎక్స్ షోరూమ్ ధరపై రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ MY2025 స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది.

కవాసకీ Z650RS గురించి..

Advertisement

Z650RS రెట్రో స్టైల్ మిడిల్‌వెయిట్ బైక్.  క్లాసిక్ డిజైన్, గుండ్రని హెడ్‌ లైట్, సింపుల్ బాడీ స్టైల్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 649cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 67bhp పవర్, 64Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ బైక్ సాఫ్ట్, స్మూత్ పవర్ డెలివరీని కలిగి ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, సెమీ డిజిటల్ మీటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

కవాసకి ఇండియా ఈ ఆఫర్లతో తన ప్రీమియం బైక్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చింది. సూపర్‌ బైక్, రెట్రో స్టైల్ బైక్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ తగ్గింపులు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు త్వరగా తీసుకోవడం మంచిది.

Read Also: హీరో ఎక్స్ ట్రీమ్ To అపాచీ.. చీప్ అండ్ బెస్ట్ డ్యూయల్ ఛానల్ ABS బైక్స్ ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×