E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, రామరాజు మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. ధీరజ్ షాకిచ్చిన ప్రేమ..భాగ్యం ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, రామరాజు మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. ధీరజ్ షాకిచ్చిన ప్రేమ..భాగ్యం ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ వెళ్లగానే ధీరజ్ అతనికి బ్యాగ్ ఇవ్వాలని హడావిడిగా వెళ్లిపోతాడు. విశ్వం అమూల్య ఆగు నీతో మాట్లాడాలి అని వెంటపడతాడు.. అమూల్య మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగను పెంచుకున్నాను. ఇప్పుడు మీ కుటుంబం గురించి నేనెప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అది కూడా మన పెళ్లి తోనే జరుగుతుంది అని ఆ విశ్వమంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను. ఇంకొకసారి నా వెంట పడితే కచ్చితంగా మా ఇంట్లో వాళ్లకి చెప్తాను అని అమూల్య అంటుంది. చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అమూల్య అనగానే విశ్వం చంపేస్తారు. విశ్వంపై కాస్త కోపంగా మాట్లాడిన అమూల్య విశ్వం వెళ్లిన తర్వాత అతను ఇచ్చిన చైన్ ని తీసుకుంటుంది. విశ్వం నా ప్లాన్ సక్సెస్ అయిందని ఫుల్ హ్యాపీగా ఉంటాడు…

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రామరాజు ఆ విషయాన్ని ధీరజ్ని అడగాలని అనుకుంటాడు.. నీ భార్యని పోలీస్ చేయాలనే అనుకుంటున్నావా నాకెందుకు చెప్పలేదు ఇంటి పెద్దని నేనొక్కడినే బతికే ఉన్నాను కదా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుని అంత పెద్ద వాడివి ఐపోయావని రామరాజు ధీరజ్ని అరుస్తాడు. ఇంకా ప్రేమ చదువు అయిపోలేదు కదా నాన్న..అయిపోయిన తర్వాత చెబుదామని అనుకున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నాన్న అని ధీరజ్ అంటాడు. నర్మద కూడా ధీరజ్ కి సపోర్ట్ అవడంతో రామరాజు ఏం మాట్లాడాడు. తన భార్య జాబ్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు కదా మామయ్య గారు అని నర్మదా అంటుంది.

Advertisement

నర్మదా ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం వినడు.. హాయ్ బాబోయ్ నువ్వేం మాట్లాడుతున్నావ్ నర్మదా అసలు ఆ ఇంట్లో వాళ్ళు మావయ్య గారికి చేసిన అవమానం ని గుర్తు లేదా మావయ్య గారి చొక్కా అని చించేసి ఎంతగానో అవమానించారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేయమంటావా అని శ్రీవల్లి కావాలని పుల్లలు పెడుతుంది. ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు? వదిన అలాంటివి ఏమీ జరగవు నువ్వు ఏమీ మాట్లాడదు అని ధీరజ్ అంటాడు. ఎందుకు జరగవు ఎందుకు జరగవు అని రామరాజు అరుస్తాడు. వాళ్లు కచ్చితంగా కూతురు సంపాదనతో తింటున్నామని నన్ను అంటారు అందుకే ప్రేమ జాబ్ చేయడానికి వీలు లేదు. చదువు అయిపోయిన తర్వాత ఎటువంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని రామరాజు తేల్చి.

మీ నిర్ణయం అది అయితే నేను నా భార్యను బాధ్యతగా చూసుకొని తన కోరికను తీర్చే హక్కు నాకుంది కచ్చితంగా ప్రేమను పోలీస్ చేసి చూపిస్తాను అని ధీరజ్ అంటాడు. మీ వాళ్ల గురించి నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నావ్.. బుజ్జమ్మ వాళ్ళు ఎన్ని మాటలుంటారో నీకు తెలియదా అని రామరాజు వేదవతి పై సీరియస్ అవుతాడు. ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి నాకోసం నువ్వు ఇంట్లో వాళ్ళందరి చేత మాటలు పడాల్సిన అవసరం లేదు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని ధీరజ్ అంటాడు. నేను మావయ్య గారు చెప్పినట్టు ఎటువంటి జాబ్ చేయను అని ప్రేమ అంటుంది. నేను ఓడిపోయినట్లే కదా అని ధీరజ్ అంటాడు. భర్తగా నీ బాధ్యతని తీర్చాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. కచ్చితంగా నా నిర్ణయానికి నువ్వు అడ్డుపడకుండా ఉంటే మంచిది అని ధీరజ్ చెప్తాడు.

Advertisement

శ్రీవల్లి బుల్లెట్ బండి పై తన పుట్టింటికి వెళ్తుంది. అది చూసిన భాగ్యం ఆనందరావు మన కూతురు అక్కడ ఏదో పుల్ల పెట్టేసింది అందుకే ఇంత సంతోషంగా వచ్చేసింది అంటూ సంతోష్ పడతారు. బుల్లెట్ బండిపై చీమటపాకాయ్ లాగా అలా వస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని ఆనంద్ రావు భాగ్యం ఇద్దరు ఫుల్ హ్యాపీ అవుతారు.. ఇక తర్వాత నర్మద పని కూడా పడితే ఆ ఇంటికి నువ్వే మహారాణివి ఆస్తి మొత్తం నీ చేతిలోకి చేస్తుంది అని భాగ్యం ఆశ పడుతుంటుంది.. ఇక తర్వాత సేన స్టేషన్ నుంచి విడుదల అయ్యి ఇంటికి వస్తాడు.

Also Read : మా మనోభావాలు దెబ్బతిన్నాయి… రాజమౌళిపై ఫిర్యాదు చేసిన హిందూ సంఘం..

రామరాజు కుటుంబం ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ సరదాగా ఉంటారు. వాళ్ళని చూసిన సేన భద్ర ఇద్దరు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు.. చెల్లెల్ని ఆ పనోడు లేపుకుపోయినప్పటి నుంచి మన ఇంట్లో సంతోషాలు దూరం అయిపోయాయి త్వరలోనే ఆ సంతోషాల్ని దూరం చేద్దాం అని భద్ర అంటుంది.. సేన మాత్రం ప్రేమను పిలుస్తాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం అయితే ఆపరేషన్ చేయించి నిన్ను బయటకు తీశాం అప్పటినుంచి ఏడాది పాటు కంటికి రెప్పలా కాపాడుకుందాం. అలాంటి నువ్వు తల్లిదండ్రులను ఎదిరిస్తావని అస్సలు ఊహించలేదు అంటూ.. సేన ఎమోషనల్ అవుతాడు. కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. ఆ మాట విన్న ప్రేమ బాధపడుతుంది. ప్రేమ బాధపడుతుంది కదా మనం తనని సంతోష పెట్టాలి అని శ్రీవల్లి అదిరిపోయే ప్లాన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×