E-Paper
Advertisement

BMW పై ఆధారపడ్డ ఇద్దరి జీవితాలు.. ఇది ఎవరికి టర్నింగ్ పాయింట్..!

BMW పై ఆధారపడ్డ ఇద్దరి జీవితాలు.. ఇది ఎవరికి టర్నింగ్ పాయింట్..!
Advertisement

Ravi Teja BMW: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన హీరో రవితేజ గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య..వంటి సినిమాల తర్వాత వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో రవితేజ కెరీర్‌పై అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది. ఇప్పుడు అదే పరిస్థితిని మార్చే సినిమాగా..భర్త మహాసాయలకు విజ్ఞప్తి (BMW)పై అందరి చూపు పడింది.

ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ తిరుమల అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎమోషనల్ కథలు.. యూత్‌కు కనెక్ట్ అయ్యే సున్నితమైన కథనాలు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ, శైలజా రెడ్డి అల్లుడు.. ఈ సినిమాలు అన్నీ కూడా కామెడీతో పాటు ఎమోషన్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అయితే ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన దారిలో వెళ్లి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. తీసుకొస్తున్నాడు.

Advertisement

భర్త మహాసాయలకు విజ్ఞప్తి కథ ఒక వివాహిత వ్యక్తి చుట్టూ తిరిగే ప్రేమ త్రికోణం నేపథ్యంలో సాగుతుంది. ఈ కథను సరదాగా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్, టీజర్‌లకు వచ్చిన స్పందన చాలా పాజిటివ్‌గా ఉంది. మొదటి సీన్ నుంచే నవ్వులు పూయించేలా సినిమా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ సినిమా విషయంలో కిషోర్ తిరుమల చాలా ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం..ఆ తర్వాత దూకుడుగా ప్రమోషన్లు చేయడం.. ఇలా అన్ని.. కలిపి సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నా కూడా భర్త మహాసయులకు విజ్ఞప్తి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో రవితేజ సినిమాకు ఇంత పాజిటివ్ బజ్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

Advertisement

ప్రమోషన్లలో కూడా కిషోర్ తిరుమల ప్రత్యేకంగా కనిపించారు. వరుస ఇంటర్వ్యూలు.. స్టేజ్‌పై హీరోయిన్లతో కలిసి డాన్స్ చేయడం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా రవితేజకు మాత్రమే కాదు..కిషోర్ తిరుమలకు కూడా చాలా కీలకం. రవితేజకు ఇది ఒక రీ-ఎంట్రీ లాంటి సినిమా అయితే, కిషోర్ తిరుమలకు కొత్త జానర్‌లో తన సత్తా చూపించే అవకాశం. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అయితే ఇద్దరి కెరీర్‌లకు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.

SLV బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’ జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి పండగకు కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది ఒక మంచి ఎంటర్‌టైనర్ అవుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.

ALSO READ: Chiranjeevi: చిరంజీవి సినిమాకి ఫైనాన్స్ కష్టాలు.. 30 కోట్ల కోసం మెగాస్టార్ ని వదులుకున్న స్టార్ హీరో..!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×