E-Paper
Advertisement

Cockfight: పందెం కోళ్లను ఎలా పెంచుతారు? వాటికి ఎలాంటి ఆహారం పెడతారు?

Cockfight: పందెం కోళ్లను ఎలా పెంచుతారు? వాటికి ఎలాంటి ఆహారం పెడతారు?

సంక్రాంతి వస్తుందంటే.. ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలే. వారం రోజులు ముందుగానే పల్లెల్లో కోళ్ల పందాల సందడి మొదలైపోతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పందెం రాయుళ్లు తమ లక్‌ను పరీక్షించుకోడానికి సిద్ధమైపోతారు. అదంతా సరే.. మరి ఆ పందెం బరిలోకి దిగే కోళ్ల పరిస్థితి ఏమిటీ.. విజయంతో కోట్లు తెచ్చిపెట్టే ఆ కోడిని ‘మొనుగాడు’లా ఎలా మారుస్తారు? వాటికి ఎలాంటి ఆహారాన్ని పెడతారు? బరిలోకి దింపిన తర్వాత పాటించాల్సిన రూల్స్ ఏమిటీ తదితర వివరాలు మీ కోసం.

పందెం కోళ్లను ఎలా పెంచుతారంటే?

ఈ పందాల్లో పాల్గొనే కోడి పుంజుల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో డేగ, కాకి, సేతు, పర్ల, నెమలి, చవల, కొక్కిరాయి, మైల్, కౌజు ముఖ్యమైనది. వీటి ధర రూ.లక్షకు పైగానే ఉంటుంది. ఇటీవల అస్లీ, హ్యాచ్, కెల్సో అనే విదేశీ రకాల కోళ్లను కూడా బరిలోకి దించుతున్నారు. కొన్ని కోళ్లను దేశీ కోళ్లతో క్రాస్ చేయించి సంకార జాతి పుంజులను తయారు చేస్తున్నారు. కోడి ఏదైనా.. దాని బలం, పోరాట పటిమే విజేతలుగా నిలబెడుతుంది. అందుకే పందాలకు 21 రోజులకు ముందు నుంచే కోళ్లకు బలమైన ఆహారాన్ని పెట్టడం మొదలు పెడతారు. ఒక్కో రోజు ఒక్కో రకం ఆహారం పెడతారు. అంతేకాదు.. వాటికి ప్రాక్టీస్ కూడా గట్టిగానే ఇస్తారు. పందాలు మొదలయ్యే వరకు ఆ కోళ్లను చంటి పిల్లలు కంటే ఎక్కువగా సాకుతారు. స్నానం చేయిస్తారు.. మసాజ్ చేస్తారు. వ్యాయమం చేయిస్తారు. పదే పదే కోపం తెప్పించి పౌరషాన్ని పెంచుతారు.

ఎలాంటి ఆహారం పెడతారు?

ఈ 21 రోజులు రకరకాల ఆహారాన్ని తినిపిస్తారు. బియ్యం, గుడ్లు, అరటి పండ్లు, బాదం, జీడి పప్పులు, ఇతర డ్రైఫ్రూట్స్ మిక్స్ చేసిన ఆహారాన్ని పెడతారు. ఓట్స్, వీట్, క్రాక్డ్ కార్న్ వంటివి పెడతారు. కొందరు మటన్ కీమా కూడా తినిపిస్తారు. అలాగే బి-కాంప్లెక్స్ ఇంజెక్షన్లు, హైప్రోటీన్ కార్బో, కాల్షియం సప్లిమెంట్లు, ఐరన్, బీ12, కార్బో లోడింగ్ స్టార్ట్, ఎలక్ట్రోలైట్స్ వంటివి కూడా ఇస్తారు. అలాగే బరువు విపరీతంగా పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు. చెరువుల్లో ఈత కొట్టిస్తారు. డైలీ సుమారు 20 నుంచి 40 నిమిషాలు వ్యాయామాలు చేయిస్తారు. ఇలా ఒక్కటేంటి.. ఇంకా చాలా రకాల ట్రైనింగ్‌లు ఇస్తారు. తల, కాళ్లు బలంగా కదిలేలా.. చురుగ్గా దాడి చేశేలా కోళ్లకు ప్రాక్టిస్ ఇస్తారు. ఈ కోళ్ల పోషణకు కొందరు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు పెడతారు.

ఆటలో రూల్స్ ఏమిటీ?

ఈ కోడి పందాల కోసం ఊరి చివరన పంట పొలాల్లో 15 నుంచి 20 అడుగుల వ్యాసంతో వృత్తాకర బరులు ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులు చూసేందుకు వీలుగా ఈ బరులు ఉంటాయి. రూల్స్ ప్రకారం.. ఒకే బరువున్న కోడి పుంజులు మధ్య పోటీ పెట్టాలి. వాటిలో ఏ ఒక్కటి బరువు ఎక్కువ ఉన్న పందెంను రద్దు చేస్తారు. ఎక్కువగా 2 లేదా 3 కేజీల బరువుండే కోళ్ల మధ్యే పోటీలు జరుగుతుంటాయి. కొంతమంది కుక్కట శాస్త్రం.. అంటే కోళ్ల పంచాంగం చూసి కోడి పుంజు జాతి, రంగును ఎంచుకుంటారు. కొందరు ఏ దిశ నుంచి వదలాలో కూడా డిసైడ్ అవుతారు. కొన్ని చోట్ల కోళ్ల కాళ్లకు కత్తులు లేకుండా పోటీలు నిర్వహిస్తారు. ఒక వేళ కత్తులు కట్టాలంటే.. అవి 3 లేదా 4 నాలుగు అంగుళాలు మాత్రమే ఉండాలి. వాటికి విషం పూయకూడదు. పందెం ప్రారంభానికి ముందు రిఫరీ వాటిని పరీక్షిస్తాడు. ఆ తర్వాత పందెం బరిలో ఉన్నవారు ఆ కోళ్ల ముక్కులు రాజేస్తారు. అలా వాటి మధ్య వైరం పెట్టి.. పోట్లాడుకొనేలా చేస్తారు. కత్తులు కడితే పోటీ త్వరగా ముగుస్తుంది. కత్తులు కట్టకపోతే ఒక గంట వరకు పోరు సాగుతుంది. ఇందులో 3 రౌండ్లు ఉంటాయి. అంటే ఒక్కో కోడికి 3 ఛాన్సులు ఉంటాయి. చివరిగా ఏ కోడి పోరాడలేక కిందపడిపోయినా, చనిపోయినా.. ప్రత్యర్థి కోడి గెలిచినట్లు ప్రకటిస్తారు.

చట్ట ప్రకారం నేరం..

కోడి పందాలు, బెట్టింగులు చట్టప్రకారం నేరం. 1960 నుంచే ఈ పందాలపై బ్యాన్ ఉంది. అయితే, 2018లో కత్తులు కట్టకుండా, జూదం లేకుండా సాంప్రదాయ పద్ధతిలో పోటీలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, అవేవీ పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. బోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ఈ పందెలు జోరుగా సాగుతాయి. ఇటీవల ఈ పందాలు మరింత కమర్షియల్‌గా మారిపోయింది. ఇక బెట్టింగులైతే కోట్లలో సాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.6 కోట్ల వరకు బెట్టింగులు జరిగినట్లు సమాచారం. కొత్త రూల్స్ ప్రకారం.. ఎక్కడైనా కోడి కాళ్లకు కత్తులు కట్టినా, బెట్టింగులు వేసిన నేరుగా కటకటాల పాలవుతారు. ఈ పందాలను సాంప్రదాయకంగానే చూడాలి గానీ.. బెట్టింగులకు అడ్డగా మార్చకూడదని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్నారు.

కోడి ఓడితే.. పకోడి’

ఈ పోటీల్లో ఓడిపోయిన కోళ్లను గెలిచిన వ్యక్తి సొంతం చేసుకుంటాడు. వాటిని వండుకుని తినేస్తారు. కొందరు అక్కడికక్కడే వేలం వేసి విక్రయిస్తారు. పందెం కోళ్ల మాంసం చాలా రుచిగా ఉంటుందని నమ్ముతారు. అందుకే వాటికి భారీగా డిమాండ్ ఉంటుంది. రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని చోట్ల బరుల దక్కరే దుకాణాలు పెట్టి.. పందెం కోళ్ల పకోడీ, ఇతర వంటకాలను విక్రయిస్తారు. ఒక వేళ పందెంలో కోడి బతికి ఉంటే.. దాని యజమాని తిరిగి తీసుకెళ్లి చికిత్స చేయించుకొని మళ్లీ వచ్చే పందాలకు వాడుకోవచ్చు. కానీ, ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×