E-Paper
Advertisement

Nokia Phones: 2010లో ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు ఇప్పుడు డెలివరీ.. వ్యాపారి షాకింగ్ రియాక్షన్!

Nokia Phones: 2010లో ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు ఇప్పుడు డెలివరీ.. వ్యాపారి షాకింగ్ రియాక్షన్!
Advertisement

Nokia Phones: లిబియా రాజధాని ట్రిపోలీకి చెందిన ఒక వ్యాపారి కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మనం ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే రెండు రోజులు ఆలస్యమైతేనే అసహనానికి గురవుతాం. కానీ, ఈ వ్యాపారి తాను ఆర్డర్ చేసిన వస్తువుల కోసం ఏకంగా 16 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలంగా ఆగిపోయిన ఆ షిప్‌మెంట్ ఎట్టకేలకు అతడి చేతికి అందింది. అయితే అందులో ఉన్నది నేటి తరం స్మార్ట్‌ఫోన్లు కాదు, ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా హ్యాండ్‌సెట్లు కావ‌డం విశేషం.

నోకియా ఫోన్లు మార్కెట్‌లో రారాజుగా ఉన్న 2010 సమయంలో, సదరు లిబియా వ్యాపారి పెద్ద మొత్తంలో నోకియా మొబైల్ ఫోన్ల కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే, 2011లో లిబియాలో తలెత్తిన అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత, తీవ్రమైన ఘర్షణల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల అతడి షిప్‌మెంట్ ఎక్కడో ఇరుక్కుపోయింది. దశాబ్ద కాలం పైగా సాగిన ఆ గందరగోళంలో ఆ వ్యాపారి కూడా తన ఆర్డర్ గురించి మర్చిపోయాడు.

Advertisement

దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆ షిప్‌మెంట్ క్లియర్ అయ్యి ట్రిపోలీలోని అతడి దుకాణానికి చేరుకోవ‌డంతో ఆనందంతో పాటూ, ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. ఆ బాక్సులను తెరుస్తున్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ బాక్సుల్లో ఒకప్పటి ఫేమస్ నోకియా మోడల్స్ (బటన్ ఫోన్లు) భద్రంగా ఉన్నాయి. వాటిని చూసి ఆ వ్యాపారి అతడి స్నేహితులు ఆశ్చర్యంతో నవ్వు ఆపుకోలేకపోయారు.

ఆ వ్యాపారి బాక్సులో ఉన్న ఫోన్లను చూస్తూ.. “ఇవి మొబైల్ ఫోన్లా లేక పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికిన ప్రాచీన వస్తువులా ?” అంటూ వేసిన జోకుకు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. నేడు మనం 5G, ఫోల్డబుల్ ఫోన్ల యుగంలో ఉన్నాం.. కానీ ఆ బాక్సుల్లో ఉన్నవి కనీసం వాట్సాప్ కూడా సపోర్ట్ చేయని పాత తరం బేసిక్ మోడల్స్ అని జోక్స్ వేసుకున్నారు.

Advertisement

ఈ వార్త కేవలం 16 ఏళ్ల లేట్ డెలివ‌రీ మాత్ర‌మే కాదు.. ఒక దేశంలో యుద్ధం, అస్థిరత సామాన్య ప్రజల జీవితాలను, వ్యాపారాలను ఎంతలా దెబ్బతీస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒక వ్యాపారి మోబైల్ ఫోన్స్ కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి 16 ఏళ్ల త‌రువాత డెలీవ‌రి తీసుకోవ‌డం ఆ దేశంలోని దయనీయ స్థితిని సూచిస్తుంది.

నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “నోకియా ఫోన్ల క్వాలిటీ అద్భుతం, 16 ఏళ్ల తర్వాత కూడా అవి కొత్తవి లాగే ఉన్నాయి” అని కొందరు అంటుంటే.. “ఇవి ఇప్పటికీ పని చేస్తాయి, బ్యాటరీ వేసి చూడండి” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, ఈ ‘టైమ్ క్యాప్సూల్’ లాంటి ఘటన నోకియా పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసింది. ఇప్ప‌టికీ నోకియా ఫోన్ల బ్రాండ్ మార్కెట్లోనే ఉంద‌ని, క్లాసిక్ మోడ‌ల్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు.

Read Also: యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్.. ఇకపై అలాంటి పప్పులు ఉండకవ్, తేడా చేస్తే బుక్కవుతారు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×