E-Paper
Advertisement

Multi-starrer Movie: ఇద్దరు సూపర్ స్టార్ల సినిమా… కానీ హడావుడి మాత్రం అస్సలు కనిపించడం లేదు..!

Multi-starrer Movie: ఇద్దరు సూపర్ స్టార్ల సినిమా… కానీ హడావుడి మాత్రం అస్సలు కనిపించడం లేదు..!
Advertisement

Multi-starrer Movie: కన్నడ సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా పేరున్న హీరో..శివరాజ్ కుమార్ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా జైలర్ తర్వాత ఆయనకు ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. జైలర్ సినిమాలో కేవలం ఆయన కనిపించింది కొన్ని నిమిషాలు మాత్రమే. అయితే ఆ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటివరకు శివరాజ్ కుమార్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు కూడా.. కేవలం ఆ ఒక్క సీన్తో ఆయనకు ఫాన్స్ అయిపోయారు. అంతేకాకుండా ఈ హీరో పలుమార్లు పలు ఈవెంట్స్ లో బాలకృష్ణతో కనిపించి.. నందమూరి ఫ్యామిలీతో అతనికున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు అని అప్డేట్ కూడా ఈ హీరో దగ్గర నుంచి వచ్చింది. ఈ అన్నిటి వల్ల.. తెలుగు అభిమానుల్లో ఆయనపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే ఇంతటి క్రేజ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయన నటించిన సినిమా 45 విషయంలో మాత్రం ఆశించినంత హడావుడి కనిపించడం లేదు.

Advertisement

మరో పెద్ద విషయం ఏమిటి అంటే..ఈ చిత్రంలో శివరాజ్ కుమార్‌తో పాటు మరో స్టార్ హీరో ఉపేంద్ర కూడా ముఖ్య పాత్రలో నటించారు. ఉపేంద్ర కు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంత పెద్ద మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాకు.. సంగీత దర్శకుడు అర్జున్ జన్య.. దర్శకుడిగా మారడం మరో ప్రత్యేకత. ఈ సినిమా డిసెంబర్లో కన్నడ భాషలో విడుదలైంది. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ప్రకృతి, నైతిక విలువలు వంటి లోతైన అంశాలను.. కథలో భాగం చేశారు.

ఈ సినిమా కథ చాలా భిన్నంగా సాగుతుంది. సాధారణ కమర్షియల్ సినిమాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులకు ఇది కొంచెం టఫ్‌గా అనిపించవచ్చు. అయినా కూడా.. కర్ణాటకలో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. వసూళ్ల పరంగా సగటు స్థాయిలో నిలిచినా..వెరైటీ ప్రయత్నం.. అనే అభిప్రాయం.. ఎక్కువగా వినిపించాయి.

Advertisement

ఇప్పుడు 45 సినిమా తెలుగులో కొత్త సంవత్సరం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలు చెప్పారు. కానీ ఇంకా సామాన్య ప్రేక్షకుల్లో.. కంటెంట్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పడలేదు. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో..విడుదలవుతోంది అని కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ చిత్రానికి కనీసం మినిమం బజ్ కూడా తెలుగులో లేదు. అయితే ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటించిన ఈ చిత్రానికి తెలుగులో మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడదం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరి ఈ సినిమా విడుదలైన తర్వాత.. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే అన్న .. ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెలుసుకొని థియేటర్స్ కి వెళ్తారా లేదా అన్న విషయం చూడాలి.

ALSO READ: Tollywood Hit Movies : టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా.. స్టార్స్ లేకున్నా సూపర్ హిట్..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×