E-Paper
Advertisement

Smartphone Comparison: ఓప్పో రెనో 15 ప్రో vs ఓప్పో ఫైండ్ X9.. కొత్త ప్రీమియం ఫోన్‌లలో ఏది బెస్ట్?

Smartphone Comparison: ఓప్పో రెనో 15 ప్రో vs ఓప్పో ఫైండ్ X9.. కొత్త ప్రీమియం ఫోన్‌లలో ఏది బెస్ట్?
Advertisement

Oppo Reno 15 Pro vs Oppo Find X9 Smartphone Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఓప్పో ఇటీవలే భారతదేశంలో రెనో 15 సిరీస్‌ ఫోన్లు లాంచ్ చేసింది. ఇందులో రెనో 15 ప్రో 5G మోడల్ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో బాగా ఆకర్షణీయంగా ఉంది. కానీ దీని ధర ఓప్పో ఫ్లాగ్‌షిప్ ఫైండ్ X9కి చాలా దగ్గరగా ఉంది. ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలు ఏమిటో తెలుసుకుంటే మీరు సరైన చేసుకోవచ్చు.

ప్రాసెసర్, పనితీరు

ఓప్పో ఫైండ్ X9లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంది. ఇది రెనో 15 ప్రోలోని డైమెన్సిటీ 8450 కంటే ఎక్కువ పవర్‌ఫుల్. ఫైండ్ X9లో UFS 4.1 స్టోరేజ్ ఉండటంతో యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి. రెనో 15 ప్రోలో UFS 3.1 స్టోరేజ్ ఉంది, కాస్త తక్కువ వేగం. రెండు ఫోన్లలోనూ మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతుంది. ఫైండ్ X9లో 16GB వరకు RAM ఆప్షన్ ఉంది. రెనో 15 ప్రోలో RAM కాస్త తక్కువ ఆప్షన్లు ఉన్నా రోజువారీ పనులకు సరిపోతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ సౌలభ్యం

Advertisement

ఫైండ్ X9లో 7025mAh పెద్ద బ్యాటరీ ఉంది. రెనో 15 ప్రోలో 6500mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లలోనూ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఫైండ్ X9లో వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, ఇది అదనపు సౌలభ్యం ఇస్తుంది. రెనో 15 ప్రోలో వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు.

కెమెరా సెటప్

రెనో 15 ప్రోలో 200MP ప్రధాన కెమెరా ఉంది కానీ సెన్సర్ సైజు చిన్నది. ఫైండ్ X9లో 50MP ప్రధాన కెమెరా ఉంది కానీ సెన్సార్ పెద్దది. పెద్ద సెన్సార్ వల్ల లైట్ తక్కువగా ఉన్నప్పుడు, డైనమిక్ రేంజ్ మంచిగా వస్తుంది. ఫైండ్ X9లో F/1.6 అపర్చర్ ఉండటంతో ఎక్కువ లైట్ పడుతుంది. రెనో 15 ప్రోలో F/1.8 అపర్చర్ ఉంది. ఫైండ్ X9లో 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండడం ప్రత్యేకం.

Advertisement

రెనో 15 ప్రోలో 50MP 3.5x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంది, జూమ్ ఎక్కువ వస్తుంది. ఫైండ్ X9 4K వీడియోను 120fps వరకు రికార్డ్ చేయగలదు. రెనో 15 ప్రో 4K 60fpsకే పరిమితం. ఫైండ్ X9లో డాల్బీ విజన్, LOG రికార్డింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. రెనో 15 ప్రోలో 50MP ఫ్రంట్ కెమెరా ఉండటంతో సెల్ఫీలు బాగా వస్తాయి. ఫైండ్ X9లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సింపుల్ సెట్టింగ్స్‌‌తో బ్లాక్ చేయండి

డిస్‌ప్లే

రెండు ఫోన్లలోనూ అద్భుతమైన AMOLED డిస్‌ప్లేలు ఉన్నాయి. ఫైండ్ X9లో 6.59 ఇంచ్ స్క్రీన్ ఉంది. రెనో 15 ప్రోలో 6.78 ఇంచ్ పెద్ద స్క్రీన్ ఉంది. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్స్, DCI-P3 గామట్ ఉన్నాయి. ఫైండ్ X9లో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువగా ఉండటంతో షార్ప్‌గా కనిపిస్తుంది. రెనో 15 ప్రోలో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది.

ధర, విలువ

ఓప్పో ఫైండ్ X9 ధర రూ.74,999. రెనో 15 ప్రో ధర రూ.67,999. ఆఫ్‌లైన్ డిస్కౌంట్లతో ఫైండ్ X9 ధర మరింత తగ్గుతుంది. ఫైండ్ X9 ఫ్లాగ్‌షిప్ పనితీరు కావాలనుకునే వారికి బాగుంటుంది. రెనో 15 ప్రో కెమెరా, పెద్ద డిస్‌ప్లే కోసం చూస్తున్న వారికి మంచి ఆప్షన్. రెండు ఫోన్ల ధరల మధ్య కేవలం రూ.5000 తేడా ఉండడతో మీ అవసరాలు బట్టి ఎంచుకోవడం సులభం అవుతుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×