E-Paper
Advertisement

Upasana Konidela: ఫస్ట్ టైమ్ బేబీబంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన ఫోటో వైరల్!

Upasana Konidela: ఫస్ట్ టైమ్ బేబీబంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన ఫోటో వైరల్!
Advertisement

Upasana Konidela: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ఈమె రామ్ చరణ్ భార్యగా మెగా ఇంటికోడలుగా అందరికీ సుపరిచితమే. ఇక ఉపాసన తన వృత్తిపరమైన విషయాల ద్వారా నిత్యం ఎంతో బిజీగా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. వీటితో పాటు అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతూ ఉంటారు. ఇక ఉపాసన వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఇటీవల తన రెండవ ప్రెగ్నెన్సీ(Second Pregnancy)ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపాసన(Upasana) రామ్ చరణ్(Ramcharan) ని పెళ్లి చేసుకున్న పది సంవత్సరాల తర్వాత మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ అమ్మాయికి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేశారు. ఇలా క్లిన్ కారా  పుట్టిన రెండు సంవత్సరాలకే ఉపాసన మరొక శుభవార్తను వెల్లడించారు.

ఉపాసన వ్యాఖ్యలపై విమర్శలు..

ఉపాసన రెండవసారి ప్రెగ్నెంట్ అయినట్లు అధికారికంగా వెల్లడించడమే కాకుండా ఈసారి ఈమె కవల పిల్లలకు(Twin Babies) జన్మనివ్వబోతున్న విషయాన్ని కూడా తెలియజేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .ఈసారి ఉపాసన కచ్చితంగా మగ పిల్లలకి జన్మనివ్వబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు అయితే 2026వ సంవత్సరంలో ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది. ఇక తన ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటి నుంచి ఉపాసన పెద్దగా ఎక్కడ బయట కనిపించలేదు. ఇటీవల ఈమె హైదరాబాద్ ఐఐటి కాలేజీ మీటింగ్ లో భాగంగా చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఉపాసన బేబీ బంప్..

Advertisement

ఐఐటి విద్యార్థులతో భేటీ అవుతూ ఈమె అమ్మాయిల అందరికీ సలహా ఇచ్చారు. ముందుగా మీరు ఎగ్ ఫ్రీజ్ చేసుకోండని మీకు కావాల్సినప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకోమని చెప్పడంతో చాలామంది ఉపాసన వ్యాఖ్యలపై విమర్శలు కురిపించారు. అయితే ఈ విమర్శల పట్ల ఉపాసన స్పందిస్తూ తాను ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తానని కూడా వెల్లడించారు . ఇకపోతే ఉపాసన రెండవ ప్రెగ్నెన్సీ లో భాగంగా ఇప్పటివరకు తన బేబీ బంప్(Baby Bump) తో ఉన్న ఫోటోలను ఎక్కడ షేర్ చేయలేదు కానీ తాజాగా ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్..

Advertisement

ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి ప్రముఖ హెయిర్ స్టైలీష్ ను కలిసారని తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలలో ఉపాసన చాలా సింపుల్ లుక్ లో ఉండటమే కాకుండా తన బేబీ బంప్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇలా ఈమె బేబీ బంప్ చూస్తుంటే ఉపాసన ప్రస్తుతం సెకండ్ ట్రైమిస్టర్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈమె వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు సమాచారం. ఇలా ఉపాసన డెలివరీ సమయానికి రామ్ చరణ్ పూర్తిగా తన కుటుంబంతో ఉండడం కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంతో పెద్ది సినిమా తరువాత ఈయన తదుపరి సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Aswini Dutt Daughter wedding:  ఘనంగా అశ్వినీ దత్ కుమార్తె వివాహం..ఫోటోలు వైరల్!

Related News

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×