E-Paper
Advertisement

Car Parking Clash: కార్ పార్కింగ్ కొట్లాట.. పగిలిన తలలు.. పోలీసులు లాఠీఛార్జ్

Car Parking Clash: కార్ పార్కింగ్ కొట్లాట.. పగిలిన తలలు.. పోలీసులు లాఠీఛార్జ్
Advertisement

Car Parking Clash: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఓ హోటల్ ముందు కార్ పార్కింగ్ విషయంలో తీవ్ర ఘర్షణ నెలకుంది. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కదిరిలోని హోటల్ వద్ద కారు నిలిపి.. టిఫిన్ చేసేందుకు మరో హోటల్‌కి వెళ్లారు. ఇదే విషయంపై అక్కడ ఉన్న కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాట పెరిగింది. చిన్న వివాదమే పెద్ద రగడకు దారితీసింది.

కారు ఇక్కడి నుంచి తీవాలని అక్కడున్న కొందరు వారితో ఘర్షణ పడ్డారు. మాట మాట పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి భయంకరంగా కొట్టుకున్నారు. ఒక్కసారిగా 15 మంది అక్కడికి చేరుకొని కర్ణాటక చెందిన వ్యక్తులపై.. భయంకరంగా విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళా రోధిస్తూ వేడుకుంటున్న, చేతులు జోడించి నమస్కరిస్తున్న ఏమాత్రం కనికరించకుండా మహిళతో పాటు మరో ముగ్గురు పై దారుణంగా దాడి చేశారు.

Advertisement

ప్రాణభయంతో పరుగులుపెడుతున్న వారిని కూడా దుండగులు వెంటాడి మళ్లీ దాడి చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన కొందరినీ పక్కకు తోసేశారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ ఏరియా మొత్తం భయానక వాతావరణంగా మారింది.

అక్కడే ఉన్న కొందరు అడ్డు ఇచ్చిన వాళ్లను పక్కకు తోసేసి దుండగులు దాడులకు పాల్పడడంతో.. ఆ ప్రాంతం భయానకంగా మారింది. బాధితులు పరుగులు పెట్టి వెంటాడి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న కదిరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దుండగులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు.  ఘర్షణకు కారణమైన ఇద్దరు వర్గాల వారినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Also Read: తెలంగాణ మంత్రులు వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్..ఎస్బీఐ కేవైసీ పేరిట ఏపీకే ఫైల్స్

మహిళపై దాడి చేసిన వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×