E-Paper
Advertisement

Upcoming Movies In Summer: వేసవిలో టాలీవుడ్ హీరోల దండయాత్ర.. రేసులో స్టార్ హీరోల సినిమాలు..!

Upcoming Movies In Summer: వేసవిలో టాలీవుడ్ హీరోల దండయాత్ర.. రేసులో స్టార్ హీరోల సినిమాలు..!
Advertisement

Upcoming Movies In Summer: టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఎక్కువగా సంక్రాంతికి తమ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కారణాలవల్ల అప్పుడు ఆ సినిమా రాకపోతే కచ్చితంగా సమ్మర్ని టార్గెట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడబోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలన్నీ కూడా సమ్మర్లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి అసలు ఆలస్యం లేకుండా ఏ సినిమాలు.. ఏ తేదీలలో రిలీజ్ కాబోతున్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం..

గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా ప్రాజెక్టులు, విడుదల తేదీల మార్పులు, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం వల్ల సమ్మర్ సినిమాల హడావుడి కాస్త తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది కొన్ని సినిమాలు వేసవిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సిదం అవుతున్నాయి.. ఇక్కడ విశేషమేంటంటే ఈ సమ్మర్ కి రిలీజ్ కాబోతున్న సినిమాలన్నీ స్టార్ హీరోలు సినిమాలు కావడంతో జనాలు వాటిని చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాల రిలీజ్ డేట్స్ ను చూస్తే..

సమ్మర్ లో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు..

మార్చి 6.. 

Advertisement

సతీ లీలావతి

సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని

మార్చి 13..

Advertisement

బ్యాండ్ మేళం

ధురంధర్ 2

టాక్సిక్

మార్చి 26..

ఉస్తాద్ భగత్‌సింగ్

ఏప్రిల్ 3..

బైకర్

రాకాస

ఏప్రిల్ 10..

స్వయంభు

డెకాయిట్

ఏప్రిల్ 30..

పెద్ది

ఈ సినిమాలన్నీ కూడా వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలు నటించిన సినిమాలే కావడంతో ఈ వేసవి సినిమాల వార్ మామూలుగా ఉండదని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తా ద్ భగత్ సింగ్, నిఖిల్ స్వయంభు, యష్ టాక్సిక్, దురంధర్ 2,రామ్ చరణ్ పెద్ది సినిమాల పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

Also Read :‘బిగ్ బాస్ 10’ ఈసారి స్టార్ మాలో రాదా..? కారణం ఇదే..?

ఇక వీటితో పాటుగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన విజువల్ వండర్ మూవీ విశ్వంభర, అఖిల్ నటించిన లెనిన్,సాయి దుర్గాతేజ్ ‘సంబరాల యేటి గట్టు’ వంటి చిత్రాలు విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ సినిమాల తేదీలపై క్లారిటీ అయితే రాలేదు.. మొత్తానికి ఈ వేసవి మళ్లీ సినిమాలతో సందడిగా మారబోతుంది. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలు ఎక్కువగా ఉండడంతో మెగా అభిమానులు ఆ సినిమాలను ఎప్పుడు చూస్తామని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సమ్మర్ కి రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×