E-Paper
Advertisement

Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ ఈసారి స్టార్ మాలో రాదా..? కారణం ఇదే..?

Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ ఈసారి స్టార్ మాలో రాదా..? కారణం ఇదే..?
Advertisement

Bigg Boss 10 Telugu : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ గురించి రోజుకో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అయితే నిన్న, మొన్నటి వరకు కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించగా, ఇప్పుడు ఏకంగా టెలికాస్ట్ అయ్యే ప్లాట్ ఫామ్ మారుతుందని మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.. ఇక మీదట స్టార్ మా లో బిగ్ బాస్ ప్రసారం అవ్వదు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

స్టార్ మా నుంచి బిగ్ బాస్ అవుట్..? 

బుల్లితెరపై ప్రసారమైన టాప్ రియాల్టీ షోలలో మొదటిగా వినిపించేది బిగ్ బాస్.. వంద రోజుల ప్రయాణం 16 మంది సెలబ్రిటీలు అంటూ సాగిన ఈ షో మొదటినుంచి తెలుగులో స్టార్ మా లోనే ప్రసారమవుతుంది. తొమ్మిదవ సీజన్ వరకు స్టార్ మా లోనే ప్రసారమైన ఈ బిగ్ బాస్ ఇకమీదట ఇక్కడ కనిపించదు అంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 8 సమయం లోనే ‘ఎండమోల్ షైన్’ సంస్థ తో స్టార్ మా చేసుకున్న ఒప్పందం ముగిసిందట.. సీజన్ 12 వరకు గడువు పొడిగించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. దాంతో ఈ బిగ్ బాస్ స్టార్ మా లో ప్రసారం అవ్వదు అంటూ నెట్టింట ఓ వార్త షికారు చేస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read :ఏంటయ్యా లోకేషా.. మా బన్నీని ఏం చేస్తున్నావ్..?

త్వరలోనే ‘అగ్నిపరీక్ష’ స్టార్ట్..

బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఎనిమిదవ సీజర్ వరకు మామూలుగానే జరిగింది. అయితే ప్రతి సీజన్ కు ఒక కామనర్ ఎంట్రీ ఇస్తూ వచ్చారు. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఎనిమిదవ సీజన్లో సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఇక తొమ్మిదవ సీజన్లో మాత్రం అగ్నిపరీక్ష అనే షోను ముందుగా నిర్వహించి ఎక్కువగా కామనర్స్ ని హౌస్ లోకి తీసుకున్నారు.. అయితే ఈ షో కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఏడాది కూడా మళ్లీ అగ్ని పరీక్షను నిర్వహించి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొని ఉన్నారని సమాచారం. ఇక హోస్ట్ గురించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున మళ్ళీ పదో సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది.. మరి ఈ ఏడాది ఎలాంటి థిమ్ తో బిగ్ బాస్ 10 రాబోతుందో చూడాలి.. ఈ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×